News


లో బడ్జెట్‌ ఐ ఫోన్‌ వచ్చేస్తుంది!

Wednesday 22nd January 2020
news_main1579678041.png-31099

తక్కువ ధరతో ఐ ఫోన్‌!
మార్చినాటికి మార్కెట్లో విడుదల

మార్కెట్లోకి  కొత్త స్మార్ట్‌ ఫోన్లు ఎన్ని వచ్చినా.. ఐఫోన్‌కు ఉండే క్రేజ్‌ ఏమాత్రం తగ్గదు. క్రేజ్‌కు తగ్గట్టుగానే దీని ధరం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కువమంది వినియోగదారులకు ఐఫోన్‌ను చేరువచేసేందుకు యాపిల్‌ కంపెనీ తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త  ఐఫోన్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది. ఈ ఫోన్‌ను  మార్చినాటికి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ హ్యాండ్‌సెట్‌ అసెంబ్లింగ్‌ను హాన్‌హయ్‌ ప్రీసీషన్‌ ఇండస్ట్రీ, పెగట్రాన్‌ కార్పోరేషన్‌, విస్ట్రన్‌ కార్పొరేషన్‌లకు అప్పగించింది. కాగా ఐఫోన్‌ వచ్చినప్పటినుంచి ఇప్పటిదాక తక్కువ ధరలో వస్తున్న ఐ ఫోన్‌ ఇదే కావడం విశేషం. 2017లో విడుదలైన ఐఫోన్‌ 8 లో  ఉన్న ఫీచర్లే  దీనిలో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 4.7 ఇంచుల స్ర్కీన్‌, ఇప్పటి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉన్న ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌లు అందుబాటులోకి తీసుకురానున్నారు. అసెంబ్లింగ్‌ దశలో ఉన్న ఈ ఫోన్‌ ధరను  కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. 2020లో మరిన్ని కొత్త ఫీచర్లు, 5 జీ కనెక్టివిటి, పాస్టర్‌ ప్రొసెస్సర్‌, 3-డి బ్యాక్‌ కెమెరా వంటి వాటితో హైఎండ్‌ ఐ ఫోన్‌లను అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వెల్లడించింది.



You may be interested

2020లో పెట్టుబడులకు 15 స్టాక్స్‌

Wednesday 22nd January 2020

గత రెండేళ్లుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రధాన కంపెనీలు ర్యాలీ చేస్తూవచ్చాయని, ఇకపై ఈ పరిస్థితి మారనుందని బ్రోకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి. జీడీపీ బలపడేందుకు వీలుగా బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు, ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు అంచనా వేశాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలు పుంజుకోనున్నట్లు తెలియజేశాయి. వెరసి 2020లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 15-20 శాతం స్థాయిలో రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో మార్కెట్లు

తగ్గిన వాహన విక్రయ రిజిస్ట్రేషన్లు: నష్టాల బాటలో అటోషేర్లు

Wednesday 22nd January 2020

వరుసగా రెండోరోజూ అటో రంగ షేర్లు నష్టాల బాటపట్టాయి. డిసెంబర్‌లో అటో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. గతేడాది డిసెంబర్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు 15శాతం తగ్గినట్లు పట్టినట్లు మంగళవారం ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) గణాంకాలు వెల్లడించాయి. పండుగ సీజన్‌ సందర్భంగా 2019లో అక్టోబర్‌, నవంబర్‌లో వాహన అమ్మకాలుగా పెరిగాయి. ఈ తర్వాత నెల డిసెంబర్‌లో డిమాండ్‌ తగ్గడంతో అమ్మకాలు క్షీణించాయని ఎఫ్‌ఏడీఏ తెలిపింది. ఆఫర్లు అందుబాటులో ఉన్నా

Most from this category