News


జీడీపీకి త్వరలో బేస్‌ ఇయర్‌ మార్పు?

Wednesday 6th November 2019
news_main1573010657.png-29378

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు  బేస్‌ ఇయర్‌ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల్లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జీడీపీ గణాంకాలకు 2011-12 బేస్‌ ఇయర్‌గా ఉంది. దీనిని 2017-18కి మార్చనున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పునకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని, మార్పిడిపై ముందస్తు ప్రక్రియ, గణాంకాల మదింపు జరుగుతోందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రాతిపదికగా (బేస్‌ ఇయర్‌), తదుపరి ఆర్థిక సంవత్సరాలో గణాంకాలను మదింపుచేయడం జరుగుతుంది. సంబంధిత ప్రాతిపదిక సంవత్సరాన్నే బేస్‌ ఇయర్‌గా పరిగణించడం జరుగుతుంది. 



You may be interested

భారీగా తగ్గిన బంగారం

Wednesday 6th November 2019

గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా పతనమయ్యింది. ఔన్సు పసిడి ధర ఒక్కసారిగా 27 డాలర్లు పతనమై 1,483 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజులుగా అమెరికా-చైనాల తొలిదశ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలు హోరెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపినప్పటికీ, బంగారం స్థిరంగా 1,500 డాలర్లపైన ట్రేడవుతూ పలువురు బులియన్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యపర్చింది. సాధారణంగా రిస్క్‌తో కూడిన ఈక్విటీల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంటే, రక్షణాత్మక పెట్టుబడిగా భావించే

ఈ ఏడాది 1,100 స్టార్టప్‌లు

Wednesday 6th November 2019

అయిదేళ్లలో మొత్తం 9,300 అంకుర సంస్థలు మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా కొనసాగుతున్న భారత్‌ నాస్కామ్ వెల్లడి బెంగళూరు: స్టార్టప్ వ్యవస్థకు సంబంధించి భారత్ మూడో అతి పెద్ద దేశంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్‌ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900-9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ మంగళవారం వెల్లడించింది. గతేడాది టెక్‌ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800-8,200

Most from this category