News


ఇక నుంచి వెర్షన్‌ సంఖ్యతోనే ఆండ్రాయిడ్‌ ఓఎస్‌

Saturday 24th August 2019
news_main1566622947.png-27987

  • లేటెస్ట్‌ వెర్షన్‌ పేరు 'ఆండ్రాయిడ్ 10'

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌లో విరివిగా వాడకంలో ఉన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్‌)కు ఇక నుంచి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల పేర్లు పెట్టకుండా.. సింపుల్‌గా వెర్షన్‌ నంబరుతో మాత్రమే విడుదల చేయాలని టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయించింది. వివిధ వెర్షన్లకు వివిధ రకాల పేర్లు కొనుగోలుదారుల్లో గందరగోళం రేపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ బ్లాగ్‌లో వెల్లడించింది. దీంతో కొత్తగా రాబోయే వెర్షన్‌ను కేవలం 'ఆండ్రాయిడ్ 10'గా మాత్రమే వ్యవహరించనున్నట్లు వివరించింది. సాధారణంగా తమ ఇంజినీరింగ్ టీమ్‌ ఏదైనా కొత్త వెర్షన్‌ను తయారు చేసేటప్పుడు ఏదైనా ఫలహారం పేరిట అంతర్గతంగా కోడ్‌ నేమ్‌తో పిల్చుకుంటూ ఉంటుందని, తర్వాత కూడా దాదాపు అలాంటి పేర్లతోనే ఆయా వెర్షన్‌లను విడుదల చేస్తూ వస్తున్నామని గూగుల్ తెలిపింది. 2009 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచీ కప్‌కేక్‌ (ఆండ్రాయిడ్‌ 1.5), డోనట్‌, ఎక్లెయిర్‌, ఫ్రోయో, జింజర్‌బ్రెడ్‌, హనీకోంబ్‌, ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌, జెల్లీ బీన్‌, కిట్‌కాట్‌, లాలీపాప్‌, మార్ష్‌మాలో, నూగాట్‌, ఓరియో పేర్లతో ఆండ్రాయిడ్‌ వెర్షన్స్‌ను గూగుల్ విడుదల చేస్తూ వచ్చింది. గతేడాది ఆగస్టులోనే ఆండ్రాయిడ్ పై పేరిట కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇవన్నీ తినుబండారాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు మొదలైన ఆహారపదార్థాల పేర్లే కావడం గమనార్హం. ఆండ్రాయిడ్‌ ఎల్‌ ప్రవెేశపెట్టడానికి ముందు దీనికి 'లడ్డూ' పేరు పెట్టొచ్చన్న ఊహాగానాలు కూడా వచ్చాయి.



You may be interested

మళ్లీ సుంకాల పోరు..ముదిరిన వాణిజ్య యుద్ధం

Saturday 24th August 2019

యుఎస్‌ టారిఫ్‌లకు దీటుగా సుంకాలను విధించిన చైనా 75 బి. డా. యుఎస్‌ దిగుమతులపై 10 శాతం సుంకం ఫలితంగా 550 బి.డా. చైనా దిగుమతులపై 5 శాతం అదనపు సుంకం విధించిన ట్రంప్‌ చైనా నుంచి బయటకు వచ్చేయమని అమెరికన్‌ కంపెనీలను కోరిన ట్రంప్‌  టిట్‌ ఫర్‌ టాట్‌..వాణిజ్య యుద్ధం అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం

ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు వాటాలు

Saturday 24th August 2019

49 శాతం కొనుగోలుకు ఒప్పందం పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.58 శాతం వాటాలు న్యూఢిల్లీ: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా పరోక్షంగా ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కూడా వాటాలు దక్కించుకోనుంది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 7.3 శాతం వాటాలు ఉన్నాయి. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు 3.58 శాతం

Most from this category