News


రూ.199కే నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ ప్లాన్‌

Thursday 25th July 2019
Markets_main1564037481.png-27308

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్.. భారత మొబైల్‌ వినియోగదారుల కోసం అత్యంత చౌక ప్లాన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.199కే నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ప్లాన్‌లో భాగంగా ఎటువంటి ప్రకటనలు లేనటువంటి స్టాండర్డ్‌ డిఫినిషన్‌ (ఎస్‌డీ) వీడియోలను ప్రేక్షకులు వీక్షించవచ్చని వివరించింది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లకు మాత్రమే వర్తించే ఈ చౌక ప్లాన్‌ కేవలం భారత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉందని సంస్థ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ అజయ్ అరోరా తెలియజేశారు. ఇతర ఏదేశంలోనూ లేని విధంగా ఇక్కడ మొబైల్‌ ఫోన్‌ సైన్‌ అప్స్‌ తమకు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత కస్టమర్లకు చౌక ప్లాన్‌ తీసుకొచ్చిన నెట్‌ఫ్లిక్స్‌.. పే టీవీ ఏఆర్‌పీయూ (ఒక్కో చందాదారు సగటు ఆదాయం) ఐదు డాలర్ల కంటే తక్కువగా ఉన్న మార్కెట్లలో తమ సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హాత్‌వే, భారతి ఎయిర్‌ టెల్‌, యాక్ట్‌ ఫైబర్‌నెట్‌తో ఇండియాలో భాగస్వామ్యం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 14.8 కోట్ల చందాదారులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.



You may be interested

కెనరా బ్యాంక్‌ లాభం రూ.329 కోట్లు

Thursday 25th July 2019

17 శాతం వృద్ధి రూ.14,062 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.329 కోట్ల నికర లాభం సాధించింది.  గత క్యూ1లో రూ.281 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.329 కోట్లకు పెరిగిందని, 17 శాతం వృద్ధి సాధించామని  కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,192 కోట్ల నుంచి రూ.14,062 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  వడ్డీ

నిస్సాన్‌లో 10వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!

Thursday 25th July 2019

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌ ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు జపాన్‌ మీడియా బుధవారం వెల్లడించింది. కంపెనీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రచురిస్తున్నట్లు పేర్కొంది. నిస్సాన్‌ చైర్మన్‌ కార్లోస్ ఘోన్‌ అరెస్టు తరువాత ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నామని, ఇదే సమయంలో అమెరికా, యూరప్‌లో అమ్మకాలు తగ్గిపోవడం వల్ల తొలి త్రైమాసిక నిర్వహణ లాభం గణనీయంగా

Most from this category