News


హార్లిక్స్‌ కోసం నెస్లే, యూనిలీవర్‌ మధ్య పోటీ

Monday 19th November 2018
news_main1542651162.png-22191

భారత మార్కెట్లో హార్లిక్స్‌, బూస్ట్‌ తదితర ఉత్పత్తులతో కూడిన గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ (జీఎస్‌కే) కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారం కోసం యూనిలీవర్‌తో నెస్లే తీవ్రంగా తలపడనుంది. ఎందుకంటే ఈ పోటీ నుంచి ప్రధాన ‍ప్రత్యర్థి కోకో కోలా తప్పుకున్నట్టు సమాచారం. జీఎస్‌కే కన్జ్యూమర్‌లో జీఎక్‌కే వాటా కొనుగోలు ధర 3.1 బిలియన్‌ డాలర్ల నుంచి 3.5 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. విజయవంతంగా బిడ్‌లో గెలిచిన కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  

 

నెస్లే తన మాల్ట్‌ బెవరేజ్‌ మిలోను ఇప్పటికే విక్రయించి జీఎస్‌కే హార్లిక్స్‌ కోసం ఆయుధాలను సిద్ధం చేసుకుంది. దేశీయ మాల్ట్‌ డ్రింక్‌ విభాగంలో హార్లిక్స్‌ రారాజుగా ఉండడమే కారణం. ఈ విభాగాన్ని జీఎస్‌కేకు చెందిన హార్లిక్స్‌, బూస్ట్‌ శాసిస్తున్నాయి. ఈ రెండు బ్రాండ్లతో మొత్తం 60 శాతం మార్కెట్‌ వాటా జీఎస్‌కే చేతిలో ఉంది. ఇందులో ఒక్క హార్లిక్స్‌ బ్రాండ్‌ వాటాయే 43.3 శాతం ఉండడం దాని బలాన్ని తెలియజేస్తోంది. నెస్లే సంస్థకు క్రెడిడ్‌ సూసే సలహాదారుగా ఉండగా, యూనిలీవర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ సంస్థను సలహాదారుగా నియమించుకుంది. ఇక జీఎస్‌కేకు మోర్గాన్‌ స్టాన్లీ, గ్రీన్‌హిల్‌ సలహా సేవలు అందిస్తున్నాయి. యూనిలీవర్‌ సంస్థ తన ఆహార విభాగం బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జీఎక్‌కే బ్రాండ్ల వేటలోకి దిగింది. బ్రూక్‌బాండ్‌, బ్రూ, లిప్టన్‌, క్వాలిటీ వాల్స్‌ అన్నవి హిందుస్తాన్‌ యూనిలీవర్‌ దేశీయ అమ్మకాలు రూ.35,000 కోట్లలో 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక జీఎస్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలుకు నెస్లే, యూనిలీవర్‌తోపాటు పలు ప్రధాన కన్జ్యూమర్‌ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. వీటిల్లో రెకిట్‌ బెంకీసర్‌, జనరల్‌ మిల్స్‌, కెల్లాగ్స్‌, డానోన్‌, కేకేఆర్‌ ఫండ్‌ కూడా ఉన్నాయి. తుది బైండింగ్‌ ఆఫర్‌కు గడువు ఈ నెల 17తో ముగిసినప్పటికీ, కొన్ని రోజుల పాటు పొడిగించినట్టు సమాచారం. జీఎక్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌లో తనకున్న 72.5 శాతం వాటాను పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించనున్నట్టు ఈ ఏడాది మొదట్లో జీఎస్‌కే ప్రకటించింది. You may be interested

విలువ తెలుసుకునేది ఎలా?

Monday 19th November 2018

స్టాక్‌ ధర సహేతుక స్థాయిలోనే ఉందా? ఓ కంపెనీ షేరులో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ మూలాలను తప్పకుండా చూడాలంటారు నిపుణులు. అన్ని అంశాలను చూసిన తర్వాతే వాటికి అనుగునంగా షేరు ధర సహేతుక స్థాయిలోనే ఉందా? అన్న అంచనాకు రావడం సాధ్యపడుతుంది. మంచి కంపెనీని గుర్తించడమే కాదు, సరైన వ్యాల్యూషన్‌ వద్ద కొనుగోలు చేయడం కూడా ముఖ్యమైన అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కంపెనీ వ్యాపారం విలువను అంచనా

10750 పైన నిఫ్టీ ముగింపు

Monday 19th November 2018

300 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మరోసారి దేశీయ మార్కెట్‌ను ముందుండి నడిపించాయి. ఫలితంగా మార్కెట్‌ వరుసగా 3రోజూ లాభాల్లో ముగిసింది.  ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, ఐరోపా మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు లాభాల ట్రేడింగ్‌ సూచీలకు కలిసొచ్చాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఫార్మా, అటో, రియల్టీ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 10750 పాయింట్ల మార్కును

Most from this category