News


షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే

Thursday 19th December 2019
news_main1576729681.png-30304

ముంబై: జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని నెస్లే ఇండియా వినియోగదారులకు వెంటనే బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను ఆర్జించిందంటూ లాభాపేక్ష నిరోధక విభాగం (ఎన్‌ఏఏ) జారీ చేసిన షోకాజు నోటీసును పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా ప్రయోజనం పొందినందుకు రూ.90 కోట్లు చెల్లించాలని ఎన్‌ఏఏ ఈ నెల 12న జారీ చేసిన షోకాజు నోటీసులో నెస్లే ఇండియాను ఆదేశించడం గమనార్హం.

గ్రాముల్లో చేసిన మార్పులకు సంబంధించిన ఆధారాలను సమర్పించినా గానీ ఈ ఆదేశాలు జారీ చేయడం ఎంతో దురదృష్టకరమని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్‌ నారాయణన్‌ బుధవారం సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ వార్తా సంస్థతో చెప్పారు. షోకాజు నోటీసును పరిశీలించాక అవసరమైతే తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేవారు. ‘‘రూ.2, రూ.5 ఉత్పత్తిపై జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనం రూ.0.45, 0.55 పైసల చొప్పున బదిలీ చేయాలి. కాకపోతే కాయిన్లు అందుబాటులో లేవు. మరి ఈ ప్రయోజనాలను ఎలా బదిలీ చేస్తాం? అందుకే ఈ మేర గ్రాములను (బరువును) పెంచడం ద్వారా ప్రయోజనాన్ని బదిలీ చేశాం. అయినా ఈ ఆదేశాలు వెలువడ్డాయి’’ అని ఈ కేసు గురించి నారాయణన్‌ వివరించారు.  



You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!

Thursday 19th December 2019

అది ప్రభుత్వానిదే; పూర్తి సామర్థ్యం ఉంది ఆర్థికశాఖ భరోసా   ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు

ట్రంప్‌ అభిశంసనకు హౌస్‌ ఆమోదం

Thursday 19th December 2019

వచ్చే నెల్లో సెనెట్‌లో చర్చ దిగిపోయే అవకాశాలు తక్కువే.. అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా ఓటేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలపై ట్రంప్‌ను సభ అభిశంసించింది. హౌస్‌ ఆమోదం అనంతరం ఈ తీర్మానం సెనెట్‌లో చర్చకు రానుంది. సెనెట్‌లో కూడా తీర్మానం ఆమోదం పొందితే ట్రంప్ పదవి నుంచి వైదొలగాల్సిఉంటుంది. కానీ సెనెట్‌లో రిపబ్లికన్లకు ఉన్న మెజార్టీ దృష్ట్యా ట్రంప్‌ పదవికి తక్షణ ముప్పేమి ఉండదని రాజకీయ విశ్లేషకుల

Most from this category