News


నెఫ్ట్‌ లావాదేవీలు ఇక 24x7

Saturday 7th December 2019
news_main1575691422.png-30104

  • రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ
  • డిసెంబర్‌ 16 నుంచి అమల్లోకి

ముంబై: నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌/ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్‌ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్‌ 16న (డిసెంబర్‌ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది. రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్‌ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్‌బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్‌ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్‌ కింద క్లియర్‌ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు.. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రాసెస్‌ చేస్తున్నారు. You may be interested

విదేశీ పెట్టుబడుల వివరాలు ఏటా చెప్పాలి

Saturday 7th December 2019

ఈ-కామర్స్ సంస్థలకు కొత్త నిబంధన న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థలు ఇకపై తమకు అందే విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన వివరాలను .. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తెలియజేయాల్సి రానుంది. తాము ఎఫ్‌డీఐ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తున్నామంటూ ఏటా సెప్టెంబర్ 30లోగా ఆడిటర్‌ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిబంధనను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ-కామర్స్

చమురు ఉత్పత్తిలో మరింత కోత

Saturday 7th December 2019

ఒపెక్‌ దేశాల నిర్ణయం వియెన్నా: ముడి చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌), దాని మిత్ర దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రోజుకు 5,00,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత పడనుంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం అమలవుతున్న దానికి ఇది అదనం. దీంతో మొత్తం మీద ఉత్పత్తి కోత రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్లకు పెరగనుంది. వియెన్నాలోని ఒపెక్

Most from this category