News


విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!

Tuesday 26th November 2019
news_main1574739163.png-29851

  • యాక్సిస్‌, స్టాన్‌చార్ట్‌ సీఈవోలకు ఎన్‌సీఎల్‌టీ హెచ్చరిక

ముంబై: ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్‌ బ్యాంక్‌, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్‌ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్‌సీఎల్‌టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తమకు ఇప్పటిదాకా ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలివ్వలేదని బ్యాంకుల వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంపై రివ్యూ పిటీషన్ వేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. భారీ రుణాలతో ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్ దివాలా తీసిన నేపథ్యంలో ఆ సంస్థ మాజీ హెడ్‌ రమేష్ చంద్ర బవా, ఆయన కుటుంబసభ్యుల ఖాతాలను స్తంభింపచేస్తూ ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ వారు తమ ఖాతాల్లో నుంచి నిధులను విత్‌డ్రా చేసుకునేందుకు, లాకర్లను వినియోగించుకునేందుకు యాక్సిస్‌, స్టాన్‌చార్ట్‌ బ్యాంకులు అవకాశం కల్పించాయని.. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు తమకు చేరే లోగానే ఆ పరిణామాలు జరిగాయని బ్యాంకులు చెబుతున్నాయి. 



You may be interested

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Tuesday 26th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 5 పైసలు బలపడి 71.68 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్లాట్‌గా 71.74 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో పాటు, అంతర్జాతీయంగా డాలర్‌ బలపడడం వంటి అంశాలు రూపీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. యుఎస్‌-చైనా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌కు వాణిజ్య ఒప్పందంతో తొందరలో ముగింపు దొరుకుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత

2022లో కస్టమర్లకు 5జీ సేవలు

Tuesday 26th November 2019

 ఎరిక్సన్‌ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవల సబ్‌స్క్రిప్షన్‌కు మరో రెండేళ్ల సమయం పడుతుందని స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ అంచనావేసింది. చందాదారులకు ఈ సేవలు 2022లో అందుబాటులోకి రానున్నాయని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ (ఈఎంఆర్‌) పేరిట తాజాగా విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లు

Most from this category