News


జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చేతికి భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌

Friday 6th September 2019
news_main1567741027.png-28227

 

  • రూ.19,700 కోట్ల బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

న్యూఢిల్లీ: సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ రూ.19,700 కోట్లతో భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ కొనుగోలుకు వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.47,158 కోట్ల మేర భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు రాకపోవడంతో రుణాలిచ్చిన సంస్థలు కమిటీగా ఏర్పడి ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం, ఆ తర్వాత బిడ్లను ఆహ్వానించడం జరిగింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వేసిన రూ.19,700 కోట్ల బిడ్‌కు పీఎన్‌బీ ఆధ్వర్యంలోని రుణదాతల కమిటీ ఆమోదం తెలపడంతో ఎన్‌సీఎల్‌టీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మొత్తం బకాయిల్లో రుణదాతలకు 41.03 శాతమే దక్కనుంది. ఇక భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ పనితీరును మెరుగుపరిచేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ రూ.7,200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది. రెండేళ్ల దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ ఆర్జించిన లాభాలను కూడా రుణాలిచ్చిన సంస్థలకే చెల్లించాలని ఎన్‌సీఎల్‌టీ తన ఆదేశాల్లో పేర్కొంది. భూషణ్‌ వపర్‌తో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వార్షిక ఉత్పత్తి 3.5 మిలియన్‌ టన్నుల మేర పెరగనుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ గతేడాది అపోలో గ్లోబల్‌ ఇతర సంస్థలతో కలసి దివాలా పరిష్కార ప్రక్రియ కింద మోనెత్‌ ఇస్పాత్‌ అండ్‌ ఎనర్జీని సైతం సొంతం చేసుకున్న విషయం గమనార్హం. 



You may be interested

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Friday 6th September 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునర్‌ప్రారంభంకానున్న కారణంగా ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంతో 36,785 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,884 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

భారత ఈ-కామర్స్‌లోకి యూసీవెబ్‌

Friday 6th September 2019

న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తాజాగా భారత ఈ-కామర్స్‌ వ్యాపార విభాగంలో ప్రవేశించాలని యోచిస్తోంది. అనుబంధ సంస్థ యూసీవెబ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. యూసీవెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్‌ ప్రెసిడెంట్ హుయాన్‌ యాంగ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఈ-కామర్స్‌ విభాగంలోకి తమ ఎంట్రీతో పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. ఈ-కామర్స్‌ చాలా విస్తృతమైనదని, తమకు అనుకూల

Most from this category