STOCKS

News


డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ సంస్థలకు చుక్కెదురు

Saturday 10th August 2019
news_main1565415425.png-27679

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థకు ఆడిటింగ్‌ సేవలు అందించిన డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌(కేపీఎంజీ సంస్థ)కు ఎన్‌సీఎల్‌టీ షాకిచ్చింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో లోపాలపై ముందుగానే హెచ్చరించడంలో ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలంటూ కేంద్ర కార్పొరేట్‌ శాఖ లోగడ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, తమపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయించే విషయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అధికార పరిధిని ప్రశ్నిస్తూ డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కంపెనీల చట్టం కింద నెట్‌వర్క్‌ సంస్థలైన డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌లను విచారించే న్యాయాధికారం తమకు ఉందని ఎస్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఈ రెండు సంస్థలపై ఐదేళ్ల నిషేధానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు జాతీయ కంపెనీ లా అ‍ప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ), సుప్రీంకోర్టు ముందుకు వెళుతుందని తమకు తెలుసునంటూ ఆదేశాల జారీ సందర్భంగా ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆదేశాలను సవాలు చేసేందుకు ఆడిటింగ్‌ కంపెనీలకు సమయమిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్‌ 5కు వాయిదా వేసింది. ఐదేళ్ల పాటు నిషేధం కోరుతూ కార్పొరేట్‌ శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్‌ సెప్టెంబర్‌ 5న విచారణ నిర్వహించనుంది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు దురదృష్టకరమని, తదుపరి చర్యకు ముందు ఆదేశాల కాపీని అధ్యయనం చేయాల్సి ఉందని డెలాయిట్‌ పేర్కొంది. You may be interested

రేట్ల కోత వరుసలో ఆంధ్రాబ్యాంక్‌,, కెనరా బ్యాంక్‌

Saturday 10th August 2019

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా 35 బేసిస్‌ పాయింట్ల రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.40) నేపథ్యంలో తమ రుణాలపై వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా ఆంధ్రాబ్యాంక్‌, కెనరా బ్యాంక్‌లు చేరాయి. ఆర్‌బీఐ వరుసగా నాలుగు ద్వైమాసిక కాలాల్లో 1.1 శాతం రేటు తగ్గించిన సంగతి తెలిసిందే.  పావుశాతం వరకూ ఆంధ్రాబ్యాంక్‌ ఓవర్‌నైట్‌, నెల, మూడు నెలలు, ఆరు

పన్ను ఊరట కల్పించండి

Saturday 10th August 2019

అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్‌చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అదనపు సర్‌చార్జీ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్‌మన్ శాక్స్‌, నొమురా, బ్లాక్‌రాక్‌, సీఎల్‌ఎస్‌ఏ,

Most from this category