News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా దరఖాస్తుకు ఎన్‌సీఎల్‌టీ ఓకే

Tuesday 3rd December 2019
news_main1575336524.png-30017

ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌పై (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్‌బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్‌ ప్రవేశానికి అర్హమైనదని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద ఆర్‌బీఐ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. 



You may be interested

వృద్ధి 5.1 శాతం మించదు

Tuesday 3rd December 2019

అంచనాలను కుదించిన క్రిసిల్‌ ఇంతక్రితం అంచనా 6.3 శాతం ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తన తాజా నివేదికలో పేర్కొంది.  ‘‘పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్‌ ఉత్పత్తి వంటి

విశాఖలో ఉబెర్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌

Tuesday 3rd December 2019

 2020 చివరికి 500 మందికి ఉపాధి న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్‌’.. విశాఖపట్నంలో తన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది

Most from this category