News


జెట్‌ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు

Friday 21st June 2019
news_main1561097379.png-26464

  • దేశ ప్రయోజనాల దృష్ట్యా వేగంగా పరిష్కరించాలి
  • పరిష్కార నిపుణుడిని కోరిన ఎన్‌సీఎల్‌టీ

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్‌ థార్న్‌టన్‌కు చెందిన ఆశిష్‌ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఈ అంశం జాతీయ ప్రాధాన్యం గలది కాబట్టి చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ, మూడు నెలల వ్యవధిలోపు పరిష్కార ప్రక్రియ కనుగొనేందుకు ప్రయత్నించాలని పరిష్కార నిపుణుడిని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ కోరింది. పిటిషన్‌లో ఎస్‌బీఐ జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రూ.967 కోట్లు తన వంతుగా వసూలు కావాల్సి ఉందని తెలిపింది. ఇందులో మూలధన అవసరాలకు రూ.505 కోట్లు, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కింద రూ.462 కోట్లను జెట్‌ఎయిర్‌వేస్‌కు అందించినట్టు పేర్కొంది. ఈ దరఖాస్తులో జోక్యం చేసుకునేందుకు తమను అనుమతించాలంటూ నెదర్లాండ్‌కు చెందిన లాజిస్టిక్స్‌ విక్రయదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్‌ తిరస్కరించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా విషయంలో ఆదేశాలు జారీ చేసే అధికారం డచ్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టుకు లేదని తేల్చి చెప్పింది. ఈ ఏడాది మార్చిలో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల విమానాన్ని సదరు లాజిస్టిక్స్‌ విక్రయదారులు జప్తు చేసుకోగా, ఈ విమానం విషయంలో దివాలా చర్యలకు అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం గమనార్హం. ఇక, నిర్వహణ అవసరాలకు రుణాలిచ్చిన జెట్‌ షమాన్‌ వీల్స్‌, గగ్గర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.8.74 కోట్లు, రూ.53 లక్షలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. వీరు పరిష్కార నిపుణుడిని సంప్రతించే హక్కును కలిగి ఉంటారని బెంచ్‌ స్పష్టం చేసింది. 



You may be interested

హెచ్‌1పై ఆంక్షలు అమెరికాకే ప్రతికూలం

Friday 21st June 2019

అక్కడి సంస్థలకు నిపుణులు దొరకరు  భారత ఐటీ పరిశ్రమకూ ఇబ్బందే నాస్కామ్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: టెక్నాలజీ నిపుణులకు వీసాలివ్వటంపై మరిన్ని పరిమితులు విధిస్తే అమెరికన్ కంపెనీలకే ప్రతికూలమవుతుందని దేశీ ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. ఈ వీసాలపై విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికన్ కంపెనీలు సరైన వారు దొరక్క బలహీనంగా మారతాయని, ఉద్యోగాలకు ముప్పు తప్పదని పేర్కొంది. వివాదాస్పద హెచ్‌-1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కుతుండటం వారి ప్రతిభకు తార్కాణమని, వీటిలో చాలా

ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవల విక్రయం

Friday 21st June 2019

పీసీవో తరహా విధానం ప్రవేశపెట్టడంపై కేంద్రం కసరత్తు     న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దుకాణాదారులు, రెస్టారెంట్లు మొదలైనవి కూడా వైఫై సేవలను విక్రయించే వెసులుబాటు తేవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. గతకాలపు పబ్లిక్ ఫోన్‌ బూత్‌ల (పీసీవో) తరహాలో ఈ వైఫై సర్వీసులు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వైఫై హాట్‌స్పాట్స్‌ను పెంచే క్రమంలో పబ్లిక్ డేటా ఆఫీస్‌ (పీడీవో)ల పేరిట

Most from this category