News


ఆమ్‌టెక్‌ ఆటో లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌

Saturday 17th August 2019
news_main1566018423.png-27826

న్యూఢిల్లీ: ఆమ్టెక్‌ ఆటో లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయం)కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ వ్యాపారాన్ని మూసేసి, ఆస్తులను విక్రయించగా వచ్చిన నిధులను రుణాలిచ్చిన సంస్థలకు చెల్లించడమే లిక్విడేషన్‌. సదరు కంపెనీ రిజిస్ట్రేషన్‌ కూడా రద్దవుతుంది. ఆమ్టెక్‌ ఆటో దివాలా పరిష్కార ప్రక్రియకు ఇచ్చిన గడువును పొడిగించాలంటూ రుణాలిచ్చిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. ఆర్‌బీఐ 2017లో దివాలా చర్యలు చేపట్టాలంటూ గుర్తించిన 12 అతిపెద్ద రుణ ఎగవేత కేసుల్లో ఆమ్టెక్‌ ఆటో కూడా ఒకటి. రుణాలిచ్చిన సంస్థల కమిటీ, బ్రిటన్‌కు చెందిన లిబర్టీహౌస్‌ను అతిపెద్ద బిడ్డర్‌గా గుర్తించగా, ఆ తర్వాత లిబర్టీ పలు కారణాలు చూపుతూ తప్పుకుంది. దాంతో మరో కొనుగోలుదారును చూసుకునేందుకు 90 రోజుల గడువు ఇవ్వాలని రుణదాతల కమిటీ కోరింది. ఐబీసీ చట్టంలో పరిష్కార ప్రణాళికకు ఇచ్చిన 270 రోజుల గడువు ఇప్పటికే ముగిసిందని పేర్కొంటూ ఎన్‌సీఎల్‌టీ చండీగఢ్‌ బెంచ్‌ లిక్విడేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు చట్టంలో 180 రోజుల సాధారణ గడువు, దీనికి 90 రోజుల అదనపు గడువు ఇవ్వడం జరిగింది.



You may be interested

వడ్డీరేట్లు మరింత దిగివచ్చే చాన్స్‌!

Saturday 17th August 2019

అంతర్జాతీయ రేటింగ్‌  దిగ్గజం ఫిచ్‌ విశ్లేషణ మార్చి నాటికి 40 బేసిస్‌ పాయింట్ల  రెపో కోత అంచనా న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 మార్చి) ముగిసే నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును మరో 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించే అవకాశం ఉందని  విశ్లేషించింది. ఇప్పటి

జెట్ ఎయిర్‌వేస్‌ ఫలితాలు ఆలస్యం !

Saturday 17th August 2019

న్యూఢిల్లీ: విమానయాన సం‍స్థ, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఆలస్యం కానున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిలపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీపై దివాళా ​‍ప్రక్రియ నడుస్తోంది. దివాలా చట్టం కింద రిజల్యూషన్‌ ప్రక్రియను రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఆశీష్‌ చౌచారియా నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల కారణంగా ఆర్థిక ఫలితాల వెల్లడి

Most from this category