News


అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో రుయాలకు చుక్కెదురు

Friday 5th July 2019
news_main1562317672.png-26824

  • పిటిషన్‌ను తిరస్కరించిన ఎన్‌సీఎల్‌ఏటీ
  • ఆర్సెలర్‌ మిట్టల్‌ రూ.42వేల కోట్ల బిడ్‌కు ఆమోదం
  • ఎస్సార్‌ స్టీల్‌ కేసులో తీర్పు

న్యూఢిల్లీ: రుయాల చివరి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ వేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆమోదం తెలిపింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ అర్హతలను సవాలు చేస్తూ రుయాలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ కొట్టివేయడంతోపాటు, ఆర్సెలర్‌ బిడ్‌కు పచ్చజెండా ఊపింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ అర్హత అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిష్కరించిందని, దీన్ని మళ్లీ, మళ్లీ లేవనెత్తరాదని రుయాల పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్‌సీఎల్‌ఏటీ వ్యాఖ్యానించింది. దాన్నే మళ్లీ, మళ్లీ ప్రస్తావించడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఎస్సార్‌ స్టీల్‌కు నిర్వహణ అవసరాలకు అరువిచ్చిన సంస్థలకు, బ్యాంకులతో సమానంగా రుణదాతల హోదాను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కల్పించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.54,547 కోట్ల మేర బకాయి పడడంతో, ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీని ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద వేలం వేయగా, ఆర్సెలర్‌ మిట్టల్‌ రూ.42,000 కోట్లతో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. ఈ మొత్తంలో రూ.2,500 కోట్ల మూలధన నిధులు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్‌ క్రెడిటార్స్‌ చేసిన రూ.49,473 కోట్ల క్లెయిమ్‌లో 60.7 శాతం వాటికి వెళతాయని, మిగిలిన మొత్తం నిర్వహణ అవసరాలకు అరువు సమకూర్చిన కంపెనీలకు చెందుతాయని ఎన్‌సీఎల్‌ఏటీ తెలిపింది. 
వాస్తవాలు తర్వాత వచ్చాయి...
‘‘సెక్షన్‌ 29ఏ కింద అనర్హతకు సంబంధించి కొత్త వాస్తవాలన్నవి సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వెలుగు చూశాయి. వీటిని తగిన పరిశీలనలోకి తీసుకోలేదు. పూర్తి ఆదేశాల కాపీ కోసం వేచి చూస్తున్నాం. అది అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటన్నది నిర్ణయిస్తాం’’ అని ఎస్సార్‌ స్టీల్‌ ప్రతిధిని వ్యాఖ్యానించారు.



You may be interested

రూ.25.49 లక్షల కోట్లకు ఫండ్‌ ఆస్తులు

Friday 5th July 2019

4 శాతం వృద్ధి  యాంఫీ వెల్లడి  న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలానికి రూ.25.49 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో ఉన్న ఫండ్‌ ఆస్తులు, రూ.24.48 లక్షల  కోట్లతో పోల్చితే ఇది 4 శాతం అధికం. ఈ వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. ఏడాది క్రితం ఈ ఆస్తుల విలువ రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు

ఆర్‌బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది

Friday 5th July 2019

ప్రభుత్వం, బ్యాంకులు సైతం విఫలమయ్యాయి బ్యాంకింగ్‌ సమస్యలపై ఉర్జిత్‌ పటేల్‌ వ్యాఖ్యలు ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్‌బీఐ

Most from this category