News


టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకం!

Wednesday 18th December 2019
news_main1576663483.png-30289

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు
టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్నియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ(అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌) ఆదేశాలిచ్చింది. మిస్త్రీని తొలగించడం, ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం అనైతికమని ప్రకటించింది. మిస్త్రీ పునర్నియామకం నాలుగువారాల్లో అమల్లోకి వస్తుందని, ఈ గడువులోపు టాటా గ్రూప్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలోని ద్విసభ్య బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. దీంతో పాటు టాటాసన్స్‌ను పబ్లిక్‌ నుంచి ప్రైవేట్‌ కంపెనీగా మార్చడాన్ని కూడా ట్రిబ్యునల్‌ నిలిపివేసింది. టాటాగ్రూప్‌ చైర్మన్‌గా తనను తొలగించడాన్ని మిస్త్రీ గతంలో ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేశారు. ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్‌ ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును మిస్త్రీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ విచారణ అనంతరం గత జూలైలో తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వార్త వచ్చినంతనే టాటా గ్రూప్‌ షేర్లు నెగిటివ్‌గా రియాక్టయ్యాయి. టాటా స్టీల్‌, టీసీఎస్‌లు గరిష్ఠాల నుంచి ఫ్లాట్‌గా మారగా, టాటా మోటర్స్‌  దాదాపు 3 శాతం పతనమైంది. 



You may be interested

రెండోరోజూ కొనసాగిన రికార్డు ర్యాలీ

Wednesday 18th December 2019

ఇంట్రాడే, ముగింపులో రికార్డు స్థాయిలే.. 12200పైన ముగిసిన నిఫ్టీ 206 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల రికార్డు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 206 పాయింట్లు లాభంతో 41,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయిoట్లు 12200 పైన 12,221 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు అటు ట్రేడింగ్‌నూ, ముగింపులోనూ కొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల

ఆ మూడింటికే సత్తా ఉంది!

Wednesday 18th December 2019

రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించేవి అవే... టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో రూ.20 లక్షల మార్కెట్‌ క్యాప్‌ సాధించగల సత్తాకలిగినవని మోతీలాల్‌ ఓస్వాల్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఒత్తిడిలో ఉన్న టెలికం, ఇన్‌ఫ్రా, రియల్టీ, పీఎస్‌బీ రంగాల ఎర్నింగ్స్‌ మొత్తం ఎర్నింగ్స్‌లో 50 శాతం ఉండడం వల్ల ఎర్నింగ్స్‌ గ్రోత్‌ స్పష్టంగా కనిపించడం లేదన్నారు. అయితే దీర్ఘకాలంలో మాత్రం కంపెనీలు మంచి ఫలితాలు

Most from this category