News


బ్యాంకింగ్‌కు మరింత ‘ఎన్‌బీహెచ్‌సీ’ తలనొప్పి

Saturday 14th December 2019
news_main1576295087.png-30218

- మూడీస్‌ నివేదిక
- మొండిబకాయిల 
తీవ్రత పెరిగే అవకాశం

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఎదుర్కొంటున్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సంక్షోభం బ్యాంకింగ్‌ మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ అంచనావేసింది. లిక్విడిటీ సమస్య వల్ల ఎన్‌బీఎఫ్‌సీలు కస్టమర్లకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని... దీనితో బ్యాంకింగ్‌ రుణ పునఃచెల్లింపుల విషయంలో ఫండింగ్‌ లభించక సంబంధిత కస్టమర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది. ఇక ఎన్‌బీఎఫ్‌సీల వ్యాపారం కూడా దెబ్బతిని తమకు రుణాలు అందించే బ్యాంకింగ్‌కు  బకాయిల చెల్లింపుల్లో  ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషించింది. వెరసి మొత్తంగా  ఎన్‌పీఏలు, లాభదాయకత, మూలధనం వంటి విషయాల్లో బ్యాంకింగ్‌పై ఈ ప్రతికూల ప్రభావం పడే వీలుందని అభిప్రాయపడింది. ఇవన్నీ బ్యాంకింగ్‌కు ‘క్రెడిట్‌ నెగిటివ్‌’ అని కూడా మూడీస్‌ తన తాజా నివేదికలో తెలిపింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దివాలా నేపథ్యంలో అప్పటి నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనితో రుణాలకు సంబంధించి వీటిపై ఆధారపడే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల లిక్విడిటీ సమస్యల వల్ల రియల్టీ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్నీ తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందనీ, ఆయా అంశాలు ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చని నివేదిక విశ్లేషించింది. 

2019లో వృద్ధి 5.6 శాతమే...
కాగా 2019లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.6 శాతమే ఉంటుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. వినియోగం నెమ్మదించడం, ఉపాధి కల్పనలో మందగమనం వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని మూడీస్‌ పేర్కొంది. అయితే 2020, 2021లో వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయడింది. ఆయా సంవత్సరాల్లో వృద్ధి వరుసగా 6.6 శాతం, 6.7 శాతంగా నమోదయ్యే వీలుందని విశ్లేషించింది. 2018లో భారత్‌ వృద్ధిరేటు 7.4 శాతంమని పేర్కొన్న మూడీస్‌,  ఈ స్థాయికి తిరిగి వృద్ధి రేటు చేరుకునేందుకు మరింతకాలం పడుతుందని అభిప్రాయపడింది. ‘‘ఆర్థిక వృద్ధికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్‌ పన్ను రేటు కోతలు, బ్యాంకులకు మూలధన కల్పన, మౌలిక రంగంలో వ్యయ ప్రణాళికలు, ఆటో రంగానికి మద్దతు వంటివి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అయితే ఆయా అంశాలు ఏవీ వినియోగ డిమాండ్‌ బలహీనతలను ప్రత్యక్షంగా నిలువరించలేవు’’ అని మూడీస్‌ పేర్కొంది. 

5 శాతానికి డీఎస్‌బీ కోత
ఇదిలావుండగా, సింగపూర్‌ డీబీఎస్‌ బ్యాంకింగ్ గ్రూప్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 5.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అయితే 2020లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్‌ ఆర్థిక వృద్ధి రెండవ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 5 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయ్యింది. 

 You may be interested

కొత్త ఫిర్యాదుల గురించి తెలియదు

Saturday 14th December 2019

- ‘క్లాస్ యాక్షన్ దావా’ వార్తలపై ఇన్ఫోసిస్ వివరణ న్యూఢిల్లీ: అమెరికాలో కొత్తగా మరో క్లాస్ యాక్షన్ దావా దాఖలైనట్లు వచ్చిన వార్తలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. అక్టోబర్‌లో వచ్చిన ఆరోపణలు తప్ప కొత్త ఫిర్యాదుల గురించి తమకేమీ తెలియదని శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు వివరణనిచ్చింది. గతంలో వచ్చిన ఆరోపణల గురించి అప్పుడే ఎక్స్చేంజీలకు తెలియజేశామని కూడా పేర్కొంది. అనైతిక విధానాలతో ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసిందనే ఆరోపణతో ఇన్ఫీపై

నిర్మలా శక్తి రామన్‌..

Saturday 14th December 2019

- ఫోర్బ్స్‌ జాబితాలో 34వ స్థానం న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.  గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం

Most from this category