STOCKS

News


నాట్కో వైజాగ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Friday 15th November 2019
news_main1573788243.png-29599

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాట్కో ఫార్మా విశాఖపట్నలోని ప్లాంట్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ప్లాంట్‌ సామర్థ్య విస్తరణలో ఇది అత్యంత కీలకమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, ఇతర అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి ఈ ప్లాంట్‌ను విస్తరించామని పేర్కొంది. ఈ ప్లాంట్‌ నుంచి ప్రధానంగా ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్‌లతో పాటూ అంకాలజీ విభాగంలో సైటోటాక్సిక్‌ బ్లాక్స్‌ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. సైట్‌ బదిలీ, రెగ్యులేటరీ ఆడిట్‌ కోసం ఇప్పటికే యూఎస్‌ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకుంది. 



You may be interested

ప్రత్యేక సంస్థగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌?

Friday 15th November 2019

అధ్యయనం చేస్తున్న తపాలా శాఖ కోల్‌కతా: భారతీయ తపాలా శాఖ తన బీమా వ్యాపార విభాగం ‘పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ను (పీఎల్‌ఐ) ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ గౌతమ్‌ భట్టాచార్య గురువారం కోల్‌కతాలో మీడియాకు చెప్పారు. పీఎల్‌ఐ పథకాలు గతంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితం కాగా, ఇప్పుడు లిస్టెడ్‌ కార్పొరేట్‌ సంస్థలు,

వేదాంత లాభం రూ.2,158 కోట్లు

Friday 15th November 2019

61 శాతం వృద్ధి  కలసివచ్చిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు  49 శాతం పెరిగిన ఇతర ఆదాయం న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం

Most from this category