News


పేయూ చేతికి అమెరికా విబ్‌మో కంపెనీ

Saturday 13th April 2019
news_main1555134275.png-25106

  • డీల్‌ విలువ రూ.484 కోట్లు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ చెల్లింపు సేవల కంపెనీ పేయూ, అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థ, విబ్‌మోను కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.484 కోట్లు(7 కోట్ల డాలర్లు). రెండు కంపెనీలు చేసే వ్యాపారాలు వేర్వేరు అని, అందుకని రెండు కంపెనీలు వేర్వేరుగానే తమ వ్యాపారాలను నిర్వహిస్తాయని పేయూ కంపెనీ తెలిపింది. విబ్‌మో సంస్థకు 20కు పైగా దేశాలకు చెందిన బ్యాంక్‌లతో భాగస్వామ్యం ఉందని, పేమెంట్‌ అథంటికేషన్‌ సేవలను అందిస్తోందని పేయూ గ్లోబల్‌ సీఎఫ్‌ఓ ఆకాశ​ మూంధ్ర చెప్పారు. విబ్‌మో కంపెనీ డిజిటల్‌ లావాదేవీల సెక్యూరిటీ సొల్యూషన్స్‌ విషయంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. తమకు పటిష్టమైన మర్చంట్‌ నెట్‌వర్క్‌ ఉందని  ఇరు సంస్థల కలయిక కారణంగా వ్యాపార సంస్థలకు, ఆర్థిక సంస్థలకు పటిష్టమై చెల్లింపుల సొల్యూషన్లను అందించగలమని వివరించారు. 



You may be interested

వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?

Saturday 13th April 2019

- ఆ దిశగానే సంకేతాలిస్తున్న గణాంకాలు - దారుణంగా పడిన పారిశ్రామిక వృద్ధి - ఫిబ్రవరిలో 0.1 శాతానికే పరిమితం - ఇది 20 నెలల కనిష్టస్థాయి - మార్చిలో 2.57 శాతం న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు ‍కేంద్రం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి

రూపాయి పరుగుకు బ్రేక్‌

Saturday 13th April 2019

- 25 పైసలు డౌన్‌ - 69.17 వద్ద క్లోజింగ్‌ ముంబై: వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన రూపాయి పరుగుకు బ్రేక్ పడింది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే 25 పైసలు క్షీణించి 69.17 వద్ద క్లోజయ్యింది. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించినట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దీనికి తోడు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేయడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిందన్న వార్తలతో రావాల్సిన

Most from this category