News


గృహ రుణాల వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలి

Thursday 9th January 2020
news_main1578543328.png-30789

  • 90 శాతం మేర రుణం ఇవ్వాలి
  • స్టాంప్‌ డ్యూటీ 50 శాతానికి తగ్గించాలి
  • ప్రి బడ్జెటరీ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రికి నరెడ్కో విన్నపం

సాక్షి, న్యూఢిల్లీః- గృహ రుణాల వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతంపైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. యూనియన్‌ బడ్జెట్‌ రూపకల్పన కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రీబడ్జెటరీ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ హిరనందన్‌ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. లోన్‌ టూ వాల్యూ(ఎల్‌టీవీ) 90 శాతానికి పెంచాలని, అంటే గృహం విలువలో 90 శాతం మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు. రెంటల్‌ హౌజింగ్, స్టాఫ్‌ హౌజింగ్‌ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90 శాతం మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్‌ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3 శాతం నుంచి 5 శాతం వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తింపు ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు. అఫర్డబులిటీ హౌజింగ్‌ నిబంధనల్లో రూ. 45 లక్షల లోపు ఉండాలన్న షరతు తొలగించాలని కోరినట్టు వివరించారు. 



You may be interested

ఎయిర్‌టెల్‌ 200 కోట్ల డాలర్ల క్యూఐపీ మొదలు

Thursday 9th January 2020

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌ క్యాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) ఇష్యూ మొదలైంది. ఈ ఇష్యూకు ఫ్లోర్‌ ధరగా రూ.452.09ను నిర్ణయించామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.14,200 కోట్లు) సమీకరిస్తామని పేర్కొంది. అంతే కాకుండా ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌(ఎఫ్‌సీసీబీ)ల ‍ద్వారా మరో వంద కోట్ల డాలర్లు(రూ.7,100 కోట్లు) సమీకరిస్తామని తెలిపింది. క్యూఐపీ, ఎఫ్‌సీసీబీల ద్వారా సమీకరించిన నిధులను నెట్‌వర్క్‌ విస్తరణకు,

బ్యాంకింగ్‌ షేర్ల ప్రారంభ జోరు

Thursday 9th January 2020

గురువారం ఆరంభంలో బ్యాంకు నిఫ్టీ దాదాపు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. బుధవారం క్లోజింగ్‌ 31373 పాయింట్ల నుంచి దాదాపు 400 పాయింట్ల లాభంతో 31748 పాయింట్ల వద్ద ఆరంభమైన సూచీ 31885 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 9.30 నిమిషాలకు 31818 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సూచీలోని షేర్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా ఆర్‌బీఎల్‌ బ్యాంకు 3.21 శాతం లాభంతో ఉంది. పీఎస్‌యూ బ్యాంకు సూచీ 1.7 శాతం

Most from this category