STOCKS

News


ప్రారంభమైన ఎన్‌ఏఆర్‌ ఇండియా సదస్సు

Sunday 25th August 2019
news_main1566708043.png-27996

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ (ఎన్‌ఏఆర్‌) ఇండియా 11వ కన్వెన్షన్‌ శనివారమిక్కడ ఘనంగా ప్రారంభమైంది. ‘గేమ్‌ చేంజర్‌’ థీమ్‌తో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ సదస్సుకు సాక్షి గ్రూప్‌ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అసోసియేట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రియల్టర్లు అంటే గృహాలు నిర్మించడంతోనే సరిపోదని, లాభాలతో పాటూ విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎన్‌ఏఆర్‌ ఇండియా చైర్మన్‌ రవి వర్మ మాట్లాడుతూ.. ఎన్‌ఏఆర్‌ ఇండియా రియల్టీ పరిశ్రమలోని రియల్టర్లు, స్టేక్‌ హోల్డర్స్, ఏజెంట్ల వాయిస్‌ను సమాజానికి వినిపించే సారధిగా పనిచేస్తుందని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో ముందుంటుందని తెలిపారు. పరిశ్రమలోని ఇతర సంఘాలతో ఒప్పందం చేసుకొని రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం చేకూర్చడంలో ఎన్‌ఏఆర్‌ ఇండియా భాగస్వామ్యం అవుతుందని గుర్తు చేశారు. తర్వాత ఎన్‌ఏఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 17–18 శాతం వరకుంటుందని పేర్కొన్నారు. 250కి పైగా అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయని, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగం నిర్మాణ రంగమని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో నిధుల సమస్యను ఎదుర్కొంటుందని, సత్వరం కేంద్రం పరిశ్రమ వృద్ధి మీద దృష్టిసారించాలని అవసరం ఉందన్నారు. నివాస, వాణిజ్య సముదాయలతో పాటూ కో–లివింగ్, కో–వర్కింగ్, వేర్‌హౌసింగ్‌ విభాగాలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతుందని, రియల్టర్లు ఆయా విభాగాల మీద దృష్టిసారించాలని సూచించారు.
ఎన్‌ఏఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాదీ..
2019–20 సంవత్సరానికి గాను ఎన్‌ఏఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన రియల్టర్‌ సుమంత్‌ రెడ్డి అర్నాని నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో బెంగళూరు రియల్టర్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ ఉన్నారు. హైదరాబాద్‌ రియల్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ) హోస్టింగ్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌), నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి 1,500 మంది రియల్టర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్‌ఏఆర్‌ ఇండియాలో 16 రాష్ట్రాల్లో 48 చాప్టర్లలో 30 వేలకు పైగా సభ్యులున్నారు.


 You may be interested

‘మరో 5-8 శాతం కరెక్షన్‌ బాకీ ఉంది..’

Sunday 25th August 2019

బ్లూచిప్‌ స్టాక్స్‌లో బాగా దిద్దుబాటుకు గురైన వాటిని పోర్ట్‌ఫోలియోకు జత చేసుకోవడం అన్నది ప్రాధాన్య క్రమంలో కొనసాగాలని.. మంచి ఎర్నింగ్స్‌ అవకాశాలు, చక్కని పనితీరు, భవిష్యత్తు వృద్ధికి అవకాశాలు, కంపెనీల ఖాతాలు క్లీన్‌గా ఉన్న స్టాక్స్‌ను ప్రస్తుత స్థాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌.   ప్రస్తుత మార్కెట్‌ 2002-2003 తరహాలో లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా నదీమ్‌ చెప్పారు. ‘‘నాడు డాట్‌కామ్‌ బబుల్‌ నుంచి

అందరివాడు... అరుణ్‌ జైట్లీ

Sunday 25th August 2019

- విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం - ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలుకు - తరవాత బీజేపీ... వయా జనసంఘ్‌ - మొదటి నుంచీ మోదీకే మద్దతుదారు - కీలక నిర్ణయాలన్నిట్లోనూ ఆయన వెంటే - న్యాయవాదిగా కాంగ్రెస్‌ వారూ క్లయింట్లే (సాక్షి నాలెడ్జ్‌ విభాగం) రాజకీయాల్లో అందరి మనసుసూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్‌ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ

Most from this category