News


మింత్రా-జబాంగ్‌కు అనంత్‌నారాయణన్‌ గుడ్‌బై

Tuesday 15th January 2019
news_main1547531669.png-23591

కొత్త సీఈవోగా అమర్‌ నాగారం
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థలు మింత్రా, జబాంగ్‌ సీఈవోగా అనంత్‌నారాయణన్‌ తప్పుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇతర అవకాశాల నేపథ్యంలో ఆయన సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. అమర్‌ నాగారంను ఈ రెండు ఫ్యాషన్‌ పోర్టళ్లకు నూతన సీఈవోగా నియమించినట్టు, ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తికి రిపోర్ట్‌ చేయనున్నట్టు తెలిపింది. నాగారం ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఇటీవలే మింత్రా, జబాంగ్‌కు మారారు. ఏడేళ్ల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపులో పనిచేస్తున్నారు. ఫ్లిప్‌కార్టు వ్యవస్థాపకుడు బిన్ని బన్సల్‌ గ్రూపు సీఈవోగా తప్పుకున్న తర్వాత... కంపెనీ స్థాయిలో నూతన నిర్వహణ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పట్నుంచి అనంత్‌ నారాయణన్‌ కంపెనీని వీడనున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. నూతన విధానంలో భాగంగా మింత్రా, జబాంగ్‌లను ఫ్లిప్‌కార్ట్‌ కిందకు తీసుకొచ్చారు. దీంతో అనంత్‌ నారాయణన్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తికి రిపోర్ట్‌ చేయాల్సి వచ్చింది. నారాయణన్‌ హాట్‌స్టార్‌లో చేరనున్నట్టు సమాచారం. ‘‘మింత్రా, జబాంగ్‌ను ఫ్యాషన్‌ ఈ కామర్స్‌ మార్కెట్లో బలమైన సంస్థగా నిలపడంతోపాటు, స్థిరమైన వృద్ధి దిశగా అనంత్‌ నడిపించారు’’ అని మింత్రా ఓ ప్రకటనలో పేర్కొంది. తమ విలువైన కస్టమర్లకు సేవలు అందించేందుకు మింత్రా, జబాంగ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ముఖ్యమైన విభాగాలుగా కొనసాగుతాయని పేర్కొంది.



You may be interested

తగ్గిన ధరలతో రేటు కోత డిమాండ్‌!

Tuesday 15th January 2019

 డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.19 శాతం 18 నెలల కనిష్టం టోకు ధరలదీ దిగువబాటే! ఎనిమిది నెలల కనిష్ట స్థాయి... 3.80 శాతానికి డౌన్‌ ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశమంటున్న పరిశ్రమలు న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్‌లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణం రెండు తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ

మళ్లీ 71వైపునకు జారిన రూపాయి

Tuesday 15th January 2019

ముంబై: డాలర్‌ మారకంలో  రూపాయి విలువ మళ్లీ పతనబాట పట్టింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ  ఒకేరోజు 43 పైసలు క్షీణించి 70.92 వద్ద ముగిసింది. గడచిన నెల రోజుల్లో ఈ స్థాయికి రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 17న రూపాయి 71.56 వద్ద ముగిసింది. కారణాలు చూస్తే... - శుక్రవారం వెలువడిన నవంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను చూస్తే, ఆ నెల్లో కేవలం అరశాతం

Most from this category