News


పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్‌’

Saturday 28th December 2019
news_main1577504117.png-30484

  • సీఆర్‌హెచ్‌ నుంచి 50 శాతం వాటా కొనుగోలు
  • రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించిన గ్రూప్‌ సంస్థలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీ సీఆర్‌మెచ్‌ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్‌ ఇండస్ట్రీస్‌’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్‌ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌, జూపల్లి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌, గ్రూప్‌ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందుకోసం వీరు దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గురువారం కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించింది. 
4 ప్లాంట్స్, 10 లక్షల టన్నుల తయారీ...
మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం ‘మహా సిమెంట్‌’ బ్రాండ్‌ పేరిట గ్రే సిమెంట్‌ తయారీ, సరఫరాలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, పాండిచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో సిమెంటు సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు, 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని  కర్నూల్, విశాఖ జిల్లాల్లోను, తమిళనాడులోను కలిసి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లున్నాయి. ఇక మై హోమ్‌ గ్రూప్‌... సిమెంట్, కన్‌స్ట్రక్షన్స్, రియల్‌ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిక్టిక్‌ వంటి రంగాల్లో విస్తరించి ఉంది. 



You may be interested

ఓటీపీతోనే ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు

Saturday 28th December 2019

జనవరి 1 నుంచి అమల్లోకి రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు లావాదేవీలకు మరింత భద్రత న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం

ఫ్లోర్‌ ప్రైస్‌ కోసం కొన్ని నెలలు ఆగాల్సిందే..

Saturday 28th December 2019

టెలికం సేవలకు ఫ్లోర్‌ ప్రైస్‌ (కనిష్ట ధరలు)ను నిర్ణయించాలని టెలికం కంపెనీలు ట్రాయ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో, దీనిపై భాగస్వాముల అభిప్రాయాలను కోరుతూ ట్రాయ్‌ సంప్రదింపుల పత్రాన్ని ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం తాము అందిస్తున్న సేవలకు, వసూలు చేస్తున్న చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, లాభ, నష్టాల్లేని స్థాయికి తీసుకొచ్చేందుకు ఫ్లోర్‌ ప్రైస్‌ను నిర్ణయించాలన్నది కంపెనీల డిమాండ్‌. అయితే, కంపెనీల డిమాండ్‌ను మన్నిస్తూనే, ఇది వినియోగదారులకు వ్యతిరేకంగా ఉండరాదన్నది

Most from this category