ఏటా 200 కొత్త శాఖలు:ముత్తూట్
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ముత్తూట్ ఫిన్కార్్ప దేశవ్యాప్తంగా ఏటా 200 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సంస్థకు 3,600 సెంటర్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 265, ఆంధ్రప్రదేశ్‌లో 317 నెలకొన్నాయని ముత్తూట్ ఫిన్కార్్ప చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాసుదేవన్ రామస్వామి తెలిపారు. బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కోల వినోద్ కుమార్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా 60 శాఖలు రానున్నాయని చెప్పారు. ఒక్కో కేంద్రానికి 3-5 మంది సిబ్బంది అవసరమవుతారని వివరించారు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 2018-19లో రూ.11,200 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15-17 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు వెల్లడించారు.
You may be interested
రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్ విస్తరణ
Friday 29th November 2019ప్రాసెసింగ్, స్టోరేజీ సామర్థ్యం పెంపు త్వరలో కంపెనీ నుంచి ఫ్రోజెన్ చికెన్ రెడీ టు ఈట్ విభాగంలోకి సైతం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి
జనవరి కల్లా ఇన్-ఫ్లయిట్ డేటా సేవలు
Friday 29th November 2019నెల్కో వెల్లడి న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు ఇంటర్నెట్ సర్వీసులు అందించే దిశగా ఇన్-ఫ్లయిట్ డేటా కనెక్టివిటీ సేవలను జనవరి కల్లా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని టాటా గ్రూప్ సంస్థ నెల్కో ఎండీ పి.జె. నాథ్ తెలిపారు. అయితే, ఇందుకోసం ఏ విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదీ, టారిఫ్‌లు ఎంత ఉండబోతున్నదీ వెల్లడించలేదు. పలు ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలు ఉంటాయని మాత్రం చెప్పారు. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన ఇండియా శాట్‌కామ్ 2019 సదస్సులో