News


పీఎంసీ బ్యాంక్‌ స్కాంపై 32 వేల పేజీల చార్జిషీట్‌

Saturday 28th December 2019
news_main1577506443.png-30492

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ స్కాంకు సంబంధించి ఐదుగురు నిందితులపై 32 వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జిషీట్‌లో ఆ బ్యాంకు మాజీ ఎండీ జాయ్‌ థామస్‌, మాజీ చైర్మన్‌ వర్యమ్‌ సింగ్‌, మాజీ డైరక్టర్‌ సుర్జిత్‌ సింగ్‌ ఆరోరాతో పాటు, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) ప్రమోటర్లు రాకేశ్‌ వర్ధమాన్‌, సారంగ్‌ వర్ధమాన్‌ నిందితులుగా పేర్కొన్నారు. మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించడానికి సంబంధించి ఐపీసీలోని వివిధ సెక‌్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. కాగా ఈ 32 వేల పేజీల చార్జిషీట్‌లో పీఎంసీ బ్యాంక్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌ రిపోర్టు, బ్యాంకు సొమ్ముతో నిందితుల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాదారులతో పాటు 340 మంది సాక్షుల వాంగ్మూలాలు తదితర వివరాలున్నాయి. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంక్స్‌లో ఎస్‌బీఐ భేష్‌

Saturday 28th December 2019

ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని సవాళ్లు లార్జ్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్స్‌ మధ్య గ్యాప్‌ తగ్గొచ్చు సిద్ధార్ధ్‌ సెడానీ అంచనా ఆనంద్‌ రాఠీ ఈక్విటీ& పోర్ట్‌ఫోలియో అడ్వయిజరీ హెడ్‌ కొన్నేళ్లుగా మొండిబకాయిల సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇకపైనా మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు ఆనంద్‌ రాఠీ ఈక్విటీ& పోర్ట్‌ఫోలియో అడ్వయిజరీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్ధ్‌ సెడానీ. విద్యుదుత్పత్తి కంపెనీలపట్ల ఆశావహంగా లేమంటూనే ప్రసారం, పంపిణీ విభాగంలోని కంపెనీలపట్ల చూపు సారించవచ్చునంటున్నారు. ఒక ఆంగ్ల

పడిపోతున్న ఆదాయంతో ప్రమాదం!

Saturday 28th December 2019

ద్రవ్య గణాంకాలు గతి తప్పుతాయి ఆర్‌బీఐ హెచ్చరిక ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు,

Most from this category