News


ఆసియా టాప్‌-20 ఖరీధైన నగరాల్లో ‘ముంబై’

Saturday 29th June 2019
news_main1561781733.png-26677

  • మెర్సెర్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ఆసియాలోని టాప్‌-20 ఖరీధైన నగరాల జాబితాలో ముంబై చోటు దక్కించుకుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారికి ఈ నగరం అత్యంత ఖరీధైనదని గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సెర్ తన నివేదికలో పేర్కొంది. ఇక అత్యధిక నివాస గృహాల ధరలను కలిగిన సిటీల్లో ప్రపంచ స్థాయి రికార్డును నెలకొల్పినట్లు తెలిపింది. జీవన వ్యయంపై ఈ సంస్థ 209 నగరాల్లో సర్వే నిర్వహించగా.. ముంబై 67వ స్థానంలో ఉంది. ఇక్కడి బయట తిండి ధరలు, యుటిలిటీస్ క్షీణతను నమోదుచేసినప్పటికీ.. నివాస గృహాల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కాస్ట్‌ లీవింగ్‌ పరంగా తాజా సర్వేలో న్యూఢిల్లీ 118వ స్థానంలో ఉంది. చెన్నై (154), బెంగళూరు (179), కోల్‌కతా (189) స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఈసారి కూడా హాంకాంగ్, టోక్యో, సింగపూర్, సియోల్ వరుసగా తొలి స్థానాల్లో నిలిచాయి.



You may be interested

2018-19లో క్యాడ్‌ 2.1 శాతం

Saturday 29th June 2019

ముంబై: కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.1 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. విలువ రూపంలో ఈ పరిమాణం 57.2 బిలియన్‌ డాలర్లు. కాగా 2017-18లో క్యాడ్‌ జీడీపీ విలువలో 1.8 శాతమే (48.7 బిలియన్‌ డాలర్లు) కావడం గమనార్హం.  మార్చి త్రైమాసికంలో సానుకూలం అయితే

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 29th June 2019

  426.416 బిలియన్ డాలర్లకు చేరిక వచ్చే 10నెలల దిగుమతులకు ఢోకాలేని స్థాయి ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది జూన్‌ 21తో ముగిసిన వారంలో ఏకంగా 4.215 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 426.416 బిలియన్ డాలర్లకు ఎగశాయి. గణనీయంగా పెరిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండడం వంటి సానుకూల అంశాలు ఇందుకు సహకరించాయి.

Most from this category