News


ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి!

Friday 8th March 2019
Markets_main1552025456.png-24489

  • ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి!
  • మహికో కేసులో నూజివీడు సీడ్స్‌కు బోంబే హైకోర్టు ఆదేశం
  • రూ.138 కోట్ల నగదు లేదా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర్వులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహికో మోన్‌శాంటో బయోటెక్‌ (ఎంఎంబీఎల్‌) కంపెనీ టెక్నాలజీ సమర్థమైనది కాదు కనక దానికి రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదంటూ నిలిపేసిన రూ.138 కోట్లను తమ వద్ద డిపాజిట్‌ చేయాలని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్‌ను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని తమవద్ద నగదు లేదా బ్యాంకు గ్యారంటీ రూపంలో డిపాజిట్‌ చేయాలని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. సబ్‌ లైసెన్స్‌ అగ్రిమెంట్‌ కింద పత్తి విత్తన కంపెనీలకు ఎంఎంబీఎల్‌ బీటీ టెక్నాలజీని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. 2015లో నూజివీడు సీడ్స్‌తో సహా పలు విత్తన కంపెనీలు ఎంఎంబీఎస్‌ బీటీ టెక్నాలజీ అసమర్థమైందని.. అందుకే రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించి రుసుము చెల్లింపులను నిలిపేశాయి. తరవాత మిగిలిన కంపెనీలు వివాదాన్ని పరిష్కరించుకున్నా... ఎన్‌ఎస్‌ఎల్‌ మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించలేదు. గతేడాది దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా రూ.117 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఎన్‌ఎస్‌ఎల్‌కు స్పష్టంచేసింది. ఎన్‌ఎస్‌ఎల్‌ చెల్లించకపోవటంతో మహికో సంస్థ దీనిపై ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై అప్పీలు చేసే అవకాశముంది కనక తాము అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు నూజివీడు సీడ్స్‌ తెలియజేసింది.



You may be interested

ఆరేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు

Friday 8th March 2019

ప్రభుత్వ సంస్కరణల ఫలితమే: సీఐఐ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఇటీవలి సంస్కరణల కారణంగా మరో ఆరేళ్లలో పది కోట్లకు పైగా  ఉద్యోగాలు వస్తాయని సిఐఐ అంచనా వేస్తోంది. నైపుణ్య స్థాయిలు పెరుగుతున్నాయని, స్టార్టప్‌ల, కొత్త వ్యాపారాల  జోరు పెరుగుతోందని సీఐఐ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ భారతి మిట్టల్‌ తెలిపారు. ఉద్యోగాల నాణ్యత పెరగడమే కాకుండా, ఆదాయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానాలు, చిన్న వ్యాపార సంస్థలకు పన్ను రేటును 25

2018-19లో 11 శాతం పడిపోనున్న పత్తి ఉత్పత్తి

Friday 8th March 2019

- 328 లక్షల బేళ్లగానే ఉండొచ్చని అంచనా - వర్షాభావ పరిస్థితులే కారణం - దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గుతాయి - కాటన్‌ అసోసియేషన్‌ అంచనాలు ముంబై: దేశంలో పత్తి (కాటన్‌) ఉత్పత్తి 2018-19 సీజన్‌లో 11 శాతం తగ్గిపోయి 328 లక్షల బేళ్లకు (ఒక్కో బేల్‌ 170 కిలోలు) పరిమితం కావచ్చని కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఏఐ) గురువారం అంచనా వేసింది. పత్తి సాగు చేసే కీలక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే దీనికి

Most from this category