News


జీవీకేకు వ్యతిరేకంగా బోంబే హైకోర్టులో అదానీ పిటిషన్‌

Monday 9th September 2019
news_main1568006048.png-28265

ముంబై: జీవీకే గ్రూపు నిర్వహణలోని ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)కు వ్యతిరేకంగా అదానీ గ్రూపు బోంబై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం వాటా ఉంది. ఈ వాటాను అదానీ గ్రూపునకు చెందిన మారిషస్‌ కంపెనీకి విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,248 కోట్లు. దీన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అదానీ గ్రూపు తన పిటిషన్‌లో కోరింది. నిజానికి ఈ ఒప్పందానికి ఎంఐఏఎల్‌లో 50.5 శాతం వాటా కలిగిన జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ తొలి నిరాకరణ హక్కు కింద తిరస్కరించింది. కానీ, గడువులోపు (2019 ఏప్రిల్‌ 4) బిడ్‌వెస్ట్‌ నుంచి వాటాలను జీవీకే కొనుగోలు చేయడంలో విఫలమైంది. బిడ్‌వెస్ట్‌ వేరెవరికీ వాటాలు విక్రయించకుండా నిరోధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించగా, కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. ఆ తర్వాత డివిజన్‌ బెంచ్‌ ఈ వివాదాన్ని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు సిఫారసు చేయగా, జీవీకే సెప్టెంబర్‌ 30 వరకు గడువు కోరింది. కానీ, బిడ్‌వెస్ట్‌ ఇందుకు నిరాకరించింది. 



You may be interested

మందగమనంలో మీ ఆర్థిక ప్రణాళిక ఇలా..!

Monday 9th September 2019

పెట్టుబడులు కొనసాగాలి... వీలైతే అదనపు పెట్టుబడులు పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరం ప్రాపర్టీ కొనుగోళ్లకు తొందరెందుకు? అత్యవసర నిధి ఏర్పాటుచేసుకోవాలి అనవసర ఖర్చులకు కళ్లెం అవసరమైనా, ఖరీదైనవి వాయిదా కుటంబానికి వైద్య బీమా రుణ చెల్లింపులు ఆపొద్దు దేశ ఆర్థిక వృద్ధి నేల చూపులు చూస్తోంది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ వృద్ధి 5 శాతానికి తగ్గింది. ఇది ఆరేళ్లలోనే కనిష్ట వృద్ధి. ఆటోమొబైల్‌ సహా పలు రంగాల్లో ఉద్యోగాలకు కోత పడుతోంది. డిమాండ్‌ పడిపోవడం, మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోవడం

చిదంబరం పాత్రపై దర్యాప్తు చేయాలి: జిగ్నేష్‌షా

Monday 9th September 2019

న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ కోలొకేషన్‌ కేసును సూపర్‌ వైట్‌ కాలర్‌ నేరంగా వ్యాపార వేత్త జిగ్నేష్‌షా అభివర్ణించారు. అక్రమంగా బిలియన్‌ డాలర్లు ఈ మార్గంలో ఆర్జించారని ఆరోపించారు. యూపీఏ హయాంలో కేవలం కొందరు బ్రోకర్లకు ట్రేడింగ్‌లో ప్రాధాన్యం ఇస్తూ వసతులు కల్పించిన ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఇతరుల పాత్రపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిగ్నేష్‌ షా ఎంసీఎక్స్‌ సహా ఎన్నో ఎక్సేంజ్‌లకు ఆద్యుడన్న

Most from this category