News


మళ్లీ ముకేశ్‌‘‘క్యాష్‌’’ కింగ్‌..!

Thursday 26th September 2019
news_main1569469717.png-28551

  • భారత్‌లో ఆయనే అత్యంత సంపన్నుడు
  • ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా 
  • రిచ్‌ లిస్ట్‌ వెల్లడి
  • వరుసగా ఎనిమిదేళ్లుగా ముకేశ్‌దే అగ్రస్థానం
  • రెండవ స్థానంలో హిందూజాలు

ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,7000 కోట్లు.  తాజా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్‌ కేంద్రంగా ఉంటున్న ఎస్‌పీ హిందూజా అండ్‌ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే...


- రూ.1,000 కోట్లుపైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే.  
- అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలర్‌మారకంలో రూపాయి విలువ ప్రాతిపదికన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. 
- రూ.1,000 కోట్లుపైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. 
- సంపన్నుల సంపద 2018తో పోల్చితే ఈ ఏడాది 2 శాతం పెరిగింది. 
- ఈ జాబితాలో దాదాపు 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. 
- మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26 శాతం) ముంబై వాసులుగా ఉన్నారు. ఈ విషయంలో రెండు, మూడు స్థానాల్లో న్యూఢిల్లీ (175), బెంగళూరు (77) ఉన్నాయి. 
- సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐలకు విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌, బ్రిటన్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 
- స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్‌ అగర్వాల్‌ (25). ఒయో రూమ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన అగర్వాత్‌ సంపద రూ.7,500 కోట్లు. సంపన్నుల్లో 40 సంవత్సరాలలోపు ఉన్న వారిలో మీడియా నెట్‌కు చెందిన 37 ఏళ్ల దివ్యాంక్‌ తురాకియా ఉన్నారు. 
- జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయస్సు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రోష్నీ నాడార్‌ (37) మొదటి స్థానంలో ఉండగా, తరువాతి స్థానంలో 68 సంవత్సరాల సుమిత్రా వీ కృష్ణా (గోద్రేజ్‌ గ్రూప్‌) ఉన్నారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. 
వృద్ధిలో వీరిపాత్ర కీలకం...

ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తల కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్‌ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్‌ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం’’

  • అనాన్‌ రెహ్మాన్‌ జునైడ్‌, హురూన్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ, చీఫ్‌ రెసెర్చర్‌


వేగం పుంజుకుంటున్న భారత్‌...
భారత్‌ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది.
- యతిన్‌ షా, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కో-ఫౌండర్‌



You may be interested

భారత్‌ వృద్ధి రేటుకు ఏడీబీ కోత

Thursday 26th September 2019

7.2 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి వేగంలో చైనా కన్నా భారత్‌ ముందు  ఉందని పేర్కొంది. తయారీ రంగం బలహీనంగా ఉండడం, పెట్టుబడుల్లో

అక్టోబర్‌ తర్వాత బ్రహ్మాండమైన ర్యాలీ: భాసిన్‌

Wednesday 25th September 2019

అక్టోబర్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లలో అద్భుతైమన ర్యాలీ చూడనున్నామని పేర్కొన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. గత కొంత కాలంగా తక్కువ ధరల్లో కొనుగోలు చేయలేకపోయామనుకున్న స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రస్తుతం మంచి  తరుణంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.    మార్కెట్లు 1,000 పాయింట్లు పెరిగిన తర్వాత 200 పాయింట్లు పడిపోవడం సహజమేనన్నారు భాసిన్‌. కానీ, ర్యాలీకి ఇది ఆరంభమేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న

Most from this category