News


2019లో ముకేశ్ అంబానీ సంపాదన ఎంతంటే..!?

Wednesday 25th December 2019
news_main1577243923.png-30415

  • అక్షరాలా రూ. 1.2 లక్షల కోట్లు
  • 2019లో పెరిగిన ముకేశ్ అంబానీ సంపద విలువ
  • ప్రస్తుతం సుమారు రూ. 4.3 లక్షల కోట్లు
  • అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానం

న్యూఢిల్లీ: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మంగళవారం నాటికి గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్ డాలర్ల నికర విలువతో (దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. ఏడాది కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లడం .. ముకేశ్ అంబానీ సంపద వృద్ధికి కారణమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం.. గడిచిన సంవత్సర కాలంలో రిలయన్స్ షేరు ఏకంగా 41 శాతం ఎగిసింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 1,544.50 వద్ద క్లోజయ్యింది. గత కొన్నాళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ వ్యాపార విభాగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. జియో పేరిట టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్.. తాజాగా జియో గిగాఫైబర్ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ దూసుకెడుతోంది. ఇక రిటైల్ రంగంలోనూ పట్టు సాధించడంతో పాటు త్వరలో ఈ-కామర్స్ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు జోరుగా కసరత్తు చేస్తోంది. ఈ-కామర్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలకూ గట్టి పోటీనివ్వనుంది. 

టాప్‌లో బిల్‌ గేట్స్‌...
బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద ఈ ఏడాది మరో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో సంపద జెఫ్ బెజోస్‌ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన 19వ స్థానంలో ఉన్నారు. 



You may be interested

‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి సెబీ బ్రేకులు

Wednesday 25th December 2019

పూల్‌ అకౌంట్ల ద్వారా లావాదేవీలు ఇక కుదరవు వినియోగం నిలిపివేతకు ప్రతిపాదన ట్రేడింగ్‌, మార్జిన్ల కోసం క్లయింట్ల పెట్టుబడులు తరలింపు తన దృష్టికి రావడంతో సెబీ జాగ్రత్త చర్యలు న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా సెబీ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ పూల్‌ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. క్లయింట్ల పెట్టుబడులు, సెక్యూరిటీలను ట్రేడింగ్‌ ద్వారా లేదా క్లియరింగ్‌ సభ్యులు మార్జిన్ల కోసం తరలించడం.. తమ

బీపీసీఎల్‌ విక్రయం ఆలస్యమైతే కరెక్షనే!

Wednesday 25th December 2019

బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటాలను ప్రైవేటు సంస్థకు విక్రయించే ప్రతిపాదనను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేస్తే అది తప్పకుండా మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీపీసీఎల్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయాన్ని 2020 మార్చి 31 తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్త కథనం మంగళవారం వెలుగు చూసింది. దీంతో బీపీసీఎల్‌ ధర 3 శాతం పడిపోయి రూ.477.40 వద్ద క్లోజయింది.    బీపీసీఎల్‌ ప్రైవేటీకరణను

Most from this category