News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో పెరిగిన అంబానీ వాటా

Thursday 19th September 2019
news_main1568864329.png-28417

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో  ప్రమోటర్‌ అనిల్‌ అంబానీ వాటా మరింతగా పెరిగింది. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ పెట్రోలియమ్‌ ట్రస్ట్‌ నియంత్రణలోని రిలయన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ హోల్డింగ్స్‌ కంపెనీ ఈ నెల 13న 2.71 శాతం వాటాకు సమానమైన 17.18 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ముకేశ్‌ అంబానీ వాటా 48.87 శాతానికి పెరిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే రెండో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ముకేశ్‌ అంబానీ, ఆయన సంబంధిత ప్రమోటర్‌ సంస్థలకు 47.29 శాతం వాటా ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు(ఎఫ్‌పీఐ)లకు 24.4 శాతం, మ్యూచువల్‌ ఫండ్స్‌కు 4.56 శాతం, బీమా కంపెనీలకు 7.1 శాతం చొప్పున వాటాలుండగా, మిగిలింది ప్రజల వద్ద ఉంది. 



You may be interested

శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం’ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లు

Thursday 19th September 2019

‘ఎం10, ఎం30’ వేరియంట్స్‌ విడుదల ధరల శ్రేణి రూ. 8,999 - 16,999 గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ ‘శాంసంగ్‌’ తాజాగా తన ‘గెలాక్సీ ఎం’ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పండుగల సీజన్‌ సందర్భంగా ‘ఎం10, ఎం30’ పేరిట వీటిని ఇక్కడ విడుదలచేసింది. ‘గెలాక్సీ ఎం10’ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో లభిస్తుండగా.. ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ. 8,999

టీవీ ధరలు దిగివస్తాయ్‌

Thursday 19th September 2019

3-4 శాతం వరకు తగ్గే అవకాశం ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకం ఎత్తివేత కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ దీంతో దేశీయంగా పెరగనున్న తయారీ న్యూఢిల్లీ: దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ

Most from this category