News


టాప్‌-10లో ముకేశ్‌ అంబానీ

Saturday 30th November 2019
news_main1575085992.png-29970

  • రూ. 4.3 లక్షల కోట్ల సంపదతో 9వ స్థానం
  • ఫోర్బ్స్‌ కుబేరుల్లో నెంబర్‌-1 జెఫ్‌ బెజోస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్‌ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్‌’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్‌ పేర్కొంది. గురువారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.10,01,555 కోట్లకు చేరి.. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే. కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో రూ.1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్‌ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్‌-10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ ఫౌండర్‌, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్‌ డాలర్లు... అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నిలిచారు. 



You may be interested

కార్వీపై 'ఆంక్ష'లను సమీక్షించండి

Saturday 30th November 2019

పీవోఏపై డిసెంబర్‌ 2లోగా నిర్ణయం తీసుకోండి సెబీకి శాట్‌ సూచనలు న్యూఢిల్లీ: క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోనివ్వకుండా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్‌ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) సూచించింది. డిసెంబర్‌ 2లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. క్లయింట్ల షేర్లను సొంత అవసరాలకు ఉపయోగించుకుందన్న ఆరోపణలతో కార్వీపై సెబీ ఆంక్షలు విధించడం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని,

2 బిలియన్ డాలర్ల సమీకరణలో యస్‌ బ్యాంక్‌

Saturday 30th November 2019

(అప్‌డేట్‌) ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్‌ సింగ్ బ్రెయిచ్‌/ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు

Most from this category