News


గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

Tuesday 30th July 2019
news_main1564463170.png-27397

  • సీఈఓవరల్డ్‌ మ్యాగజైన్‌ గ్లోబల్‌ ర్యాకింగ్స్‌
  • అత్యంత ప్రభావశీల సీఈఓల
  • జాబితాలో 10 మంది భారతీయులు
  • లక్ష్మీ మిట్టల్‌ది మొదటిస్థానమైనా
  • లగ్జెంబర్గ్‌ కేంద్ర కంపెనీగా గుర్తింపు
  • దీనితో ముకేశ్‌కు దేశంలో మొదటిస్థానం
  • వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మ్యాక్‌మిలన్‌ టాప్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓవరల్డ్‌ మ్యాగజైన్‌  తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మ్యాక్‌మిలన్‌ ముందు నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ జాబితాలో చోటు లభించింది. భారత్‌కు సంబంధించి ర్యాంకింగ్‌ విషయానికి వస్తే,  ఆర్సిలార్‌ మిట్టల్‌ చీఫ్‌ లక్ష్మీ మిట్టల్‌ 3 ర్యాంక్‌తో ముందు నిలిచారు.  అయితే ఆయన కంపెనీ కేంద్రాన్ని లగ్జెంబర్గ్‌గా పేర్కొనడం జరిగింది. దీనితో 49వ ర్యాంక్‌తో ముకేశ్‌ అంబానీ దేశంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లయ్యింది. 

టాప్‌ 3గా లక్ష్మీ మిట్టల్‌...
గ్లోబల్‌ జాబితాలో వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మ్యాక్‌మిలన్‌ ముందు నిలవగా, రెండవ స్థానంలో రాయల్‌ డచ్‌ షెల్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెన్‌ వాన్‌ బెవుర్డెన్‌ నిలిచారు. మూడవ స్థానంలో  ఆర్సిలార్‌ మిట్టల్‌ చైర్మన్‌ అండ్‌ సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ ఉన్నారు. నాల్గవ ర్యాంక్‌వ ర్యాంక్‌ను సౌదీ ఆరామ్‌కో సీఈఓ అమిన్‌ హెచ్‌ నాసర్‌ సొంతం చేసుకున్నారు. బీపీ చీఫ్‌ బాబ్‌ డుబే ఐదవ స్థానాన్ని, ఎక్సాన్‌మొబిల్‌ సీఈఓ డారిన్‌ ఉడ్స్‌ ఆరవస్థానాన్ని, ఫోక్స్‌వ్యాగన్‌ సీఈఓ హెర్బర్ట్‌ డియాస్‌ ఏడవ స్థానాన్ని, టొయాటా సీఈఓ అరియో తొయోడా ఎనిమిదవ స్థానాన్ని పొందారు. 9,10 స్థానాలను వరుసగా యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌, బెర్క్‌షైన్‌ హాత్‌వే సీఓఈ వారెన్‌ బఫెట్‌ పొందారు. అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ 11వ స్థానాన్ని, యునైటెడ్‌హెల్త్‌గ్రూప్‌ సీఈఓ డేవిడ్‌ విచ్‌మన్‌ 12వ స్థానాన్ని, శాంసంగ్‌ ఎలకా​‍్ట్రనిక్స్‌ సీఓఈ కిమ్‌ కి-నామ్‌ 13వ స్థానాన్ని పొందారు. 

గర్వకారణం: ఓఎన్‌సీసీ, ఐఓసీ
తమ సంస్థల సీఈఓలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఓఎన్‌సీసీ, ఆయిల్‌ ఇండియా కార్పొరేషన్‌ (ఐఓసీ)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. 

ప్రాతిపదిక ఇది...
సీఈఓలకు సంబంధించి సీఈఓవరల్డ్‌ మ్యాగజైన్‌ గ్లోబల్‌ ర్యాకింగ్స్‌ ప్రతిష్టాత్మకమైనవి. 96 దేశాల్లో 1,200కిపైగా సీఈఓలను ఈ ర్యాకింగ్స్‌కు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వ్యాపార పనితీరు, సీఈఓ పూర్తి బాధ్యతల కాలంలో కంపెనీ సాధించిన ఫైనాన్షియల్‌ రిటర్న్స్‌ తుది ర్యాంకింగ్‌లో 60 శాతం వెయిటేజ్‌ని కలిగిఉంటాయి. పర్యావరణం, పాలనాతీరు, కంపెనీలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌ షేర్లు, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో మార్పులు వంటి అంశాలు మిగిలిన 40 శాతం వెయిటేజీలో ఉన్నాయి. 



You may be interested

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్

Tuesday 30th July 2019

న్యూఢిల్లీ: దేశ బిలియనీర్ల జాబితాలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) బైజు రవీంద్రన్‌ చేరారు. కతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (క్యూఐఏ)-- సావరిన్‌ వెల్త్‌  ఫండ్‌ నుంచి టెక్‌ కంపెనీ బైజూస్‌కు 150 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ లభించడంతో రవీంద్రన్‌ తాజాగా బిలియనీర్ల జాబితాలో చేరారు. దీనితో కంపెనీ విలువ 6 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా తాజా వార్తలపై సంస్థ ప్రతినిధి స్పందించలేదు.  బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు

68.75 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 30th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 68.75 వద్ద మంగళవారం ప్రారంభమైంది. గత సెషన్లో రూపీ 14 పైసలు బలపడి 68.74 వద్ద ముగిసింది. ఈ నెల 31న జరగనున్న ఫెడ్‌ సమావేశంపై మదుపర్లు దృష్ఠి సారించనున్నారు. ఫలితంగా ఈ రోజు రూపీ తక్కువ పరిధిలో కదాలాడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. 

Most from this category