News


డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

Friday 30th August 2019
news_main1567143991.png-28107

  • రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ

గాంధీనగర్‌: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. "డిజిటల్ రంగం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే .. అది భారత్‌ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్‌ కేవలం 24 నెలల్లోనే నంబర్‌ వన్ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు.



You may be interested

వృద్ధి బాటలో చిన్న మందగమనమే..!

Friday 30th August 2019

ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ విశ్లేషణ సైక్లికల్‌ ఎఫెక్ట్‌గా అభిప్రాయం 2018-19 వార్షిక నివేదిక విడుదల వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల వృద్ధిపై దృష్టి అవసరమని సూచన ముంబై: భారత్‌ ప్రస్తుత మందగమన పరిస్థితులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్‌ ఎదుర్కొంటోందని పేర్కొంది. దీనిని సైక్లింగ్‌ ఎఫెక్ట్‌ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత

వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

Friday 30th August 2019

 వచ్చే నెల 10న ఆవిష్కరణ శాన్‌ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్‌ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. దానికి అనుగుణంగానే ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో 'ఐఫోన్‌

Most from this category