News


ఎంటీఆర్‌ నుంచి రెండు కొత్త ఉత్పత్తులు

Thursday 30th May 2019
news_main1559202913.png-25998

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని రెండు ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ఎంటీఆర్‌ ఫుడ్స్‌ సీఈఓ సంజయ్‌ శర్మ చెప్పారు. గుంటూరు మిరపకాయలతో చేసిన మసాలా కారం పొడి, 3 నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా ఉప్మా రెడీమేడ్‌లను ఆయన బుధవారమిక్కడ మార్కెట్లోకి విడుదల చేశారు. రెండు ఉత్పత్తులపై రూ.30 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని, వచ్చే మూడేళ్లలో వీటితో రూ.150 కోట్ల అదనపు విక్రయాలను ఆశిస్తున్నామని చెప్పారు. ఎక్కువగా దక్షిణ భారతంపైనే ఫోకస్‌ పెట్టామని, సౌత్‌లో కర్నాటకలో ఎక్కువ మార్కెట్‌ ఉందని చెప్పారాయన. తమ వ్యాపారంలో 20 శాతం తెలుగురాష్ట్రాల్లోనే జరుగుతున్నట్లు సంజయ్‌ చెప్పారు. పలు రకాల మసాలా పౌడర్లు, వెజ్‌ మిక్స్‌ల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్నామన్నారు. ఇప్పటికే రూ. 900 కోట్ల టర్నోవర్‌ను సాధించామని, త్వరలో 1000 కోట్ల టర్నోవర్‌ సాధిస్తామని చెప్పారు. దాదాపు 32 దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామన్నారు. 



You may be interested

ఏప్రిల్‌లో తగ్గిన విమాన ప్రయాణికుల రద్దీ

Thursday 30th May 2019

 ఐదేళ్ల కనిష్టస్థాయికి క్షీణత న్యూఢిల్లీ: గత నెల్లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఆర్థిక సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు నిలిచిపోయిన కారణంగా రెవెన్యూ ప్యాసింజర్ కిలోమీటర్ (ఆర్‌పీకే) వృద్ధి సైతం ఏడాది ప్రాతిపదికన 0.5 శాతం తగ్గిపోయిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తాజాగా వెల్లడించిన సమాచారం ద్వారా వెల్లడైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూత పడక ముందు వరకు రెండంకెల వృద్ధిరేటును నమోదుచేసిన భారత

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌పై ఎన్‌సీఎల్‌టీకి గెయిల్‌

Thursday 30th May 2019

ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌ జాబితాలో చేర్చాలని పిటిషన్‌ జూలై 8న తదుపరి విచారణ ముంబై: వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రూ.390 కోట్లు రాబట్టుకోడానికి ప్రభుత్వ రంగ సంస్థ- గెయిల్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. ఆపరేషనల్‌ క్రెడిటార్‌గా తనను రుణదాతల జాబితాలో చేర్చేలా తగిన ఆదేశాలను ఇవ్వాలని ఎన్‌సీఎల్‌టీని కోరినట్లు గెయిల్‌ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణను ఎంకే షరావత్‌ నేతృత్వంలోని ఎన్‌సీఎల్‌టీ ఏకసభ్య ధర్మాసనం

Most from this category