News


47 శాతం పెరిగిన ఎంఎస్‌ఆర్‌ లాభం

Thursday 15th November 2018
news_main1542258472.png-22024

సెప్టెంబరు క్వార్టరులో ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 47 శాతం పెరిగి రూ.84 లక్షలుగా నమోదైంది. టర్నోవరు రూ.47.5 కోట్ల నుంచి రూ.52 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరు పీరియడ్‌లో రూ.87 కోట్ల టర్నోవరుపై రూ.1.37 కోట్ల నికరలాభం సాధించింది. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 3.96 శాతం అధికమై రూ.15.50 వద్ద స్థిరపడింది.



You may be interested

43 శాతం తగ్గిన సువెన్‌ లాభం

Thursday 15th November 2018

సెప్టెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.18 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.112 కోట్ల నుంచి రూ.96 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.296 కోట్ల టర్నోవరుపై రూ.57 కోట్ల నికరలాభం ఆర్జించింది. బీఎస్‌ఈలో బుధవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.92 శాతం తగ్గి రూ.247.75 వద్ద స్థిరపడింది.

త్వరలో హావెల్స్‌ స్మార్ట్‌ ఫ్యాన్‌

Thursday 15th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రికల్‌ ఉపకరణాల తయారీ కంపెనీ హావెల్స్‌ ఇండియా... దేశంలో తొలి స్మార్ట్‌ ఫ్యాన్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. జనవరి నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. రిమోట్‌, మొబైల్‌ యాప్‌, వైఫైతో ఇది పనిచేస్తుంది. అలాగే అలెక్సా, గూగుల్‌ హోమ్‌ ఉపకరణాల ద్వారా కూడా ఆపరేట్‌ చేయవచ్చు. గది ఉష్ణోగ్రతను బట్టి వేగాన్ని దానంతటదే మార్చుకుంటుంది. వచ్చే వేసవి కోసం కొత్తగా 8 రకాల ఫ్యాన్లను సిద్ధం

Most from this category