News


ఇక కరెన్సీ వార్‌?

Thursday 20th June 2019
news_main1560970852.png-26427

చైనాతో వాణిజ్య యుద్ధం ఆరంభించి ప్రపంచ ఆర్థిక రంగాన్ని వణికిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ట్రంప్‌ వైఖరి చూస్తుంటే ఆయన కరెన్సీ వార్‌ మొదలెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం యూరోప్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రెసిడెంట్‌ మారియో డ్రాఘి లక్ష్యంగా ట్రంప్‌ చేసిన ట్వీట్లను నిదర్శనంగా పేర్కొంటున్నారు. కుంగిపోతున్న యూరోప్ వృద్ధికి అడ్డుకట్ట వేసేందుకు తాను సున్నా కంటే దిగువకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమేనంటూ మారియోడ్రాఘి ప్రకటన చేయగా, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యం చేసుకోవడం అసాధారణ చర్యగానే పేర్కొంటున్నారు. 

 

‘‘మారియో డ్రాఘి ఇప్పుడే మరిన్ని ఉద్దీపనలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది డాలర్‌తో యూరోను వెంటనే తగ్గేలా చేస్తుంది. ఈ అనుచిత చర్య ద్వారా అమెరికాతో పోటీ పడడం వారికి సులభతరం అవుతుంది. చైనా తదితరులతోపాటు ఎన్నో ఏళ్లుగా వారు చేస్తున్నది ఇదే’’ అని ట్రంప్‌ ఒక ట్వీట్‌ వదిలారు. మరో ట్వీట్‌లో... మారియో డ్రాఘి నుంచి ఉద్దీపనలపై వచ్చిన ప్రకటనతో జర్మన్‌ డాక్స్‌ పెరిగే క్రమంలో ఉంది. అమెరికాకు ఇది అన్యాయమైన చర్యే’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. విదేశాలు చేస్తున్న కరెన్సీ మానిప్యులేషన్‌పై ట్రంప్‌ ఆరోపణలు సంధించడం ఇదే ప్రథమం కాదు. అమెరికాతో పోటీ పడే దేశాలు తమ దేశ కరెన్సీ రేటును డాలర్‌తో తగ్గించడం వల్ల అవి ఆకర్షణీయంగా మారతాయి. డాలర్‌ మరింత బలపడి అమెరికా ఉత్పత్తులు ఖరీదవుతాయి. వాస్తవానికి ఇప్పటి వరకు బలమైన డాలర్‌ విధానాన్ని అనుసరించిన పూర్వపు అమెరికా అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్‌ భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. 

 

డ్రాఘిని నేరుగా లక్ష్యం చేసుకుని, విదేశీ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటనకు వెంటనే ట్రంప్‌ ఘాటుగా స్పందించడం అన్నది... ఇదే సమయంలో స్వదేశంలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల సమావేశం నేపథ్యంలో వేడి పుట్టిస్తోంది. బుధవారం ఫెడ్‌ నుంచి ప్రకటన వెలువడనుంది. అలాగే, జపాన్‌లో జీ20 దేశాల సమావేశం ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై సిటీగ్రూపు గ్లోబల్‌ మార్కెట్స్‌ అంతర్జాతీయ ఎకనమిస్ట్‌ సిజార్‌రోజాస్‌ స్పందిస్తూ ‘‘వారు వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. వారు తగిన ఆయుధాలను వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని  పేర్కొన్నారు. క్షీణిస్తున్న ఆర్థిక వృద్ధి నేపథ్యంలో గత నెలలో అమెరికా ట్రెజరీ తన పరిశీలనలో ఉన్న ఆర్థిక వ్యవస్థలను 12 నుంచి 21కు పెంచింది. వాచ్‌ లిస్ట్‌లోని దేశాలను నాలుగు నుంచి తొమ్మిది చేసింది. ఐర్లాండ్‌, ఇటలీ, సింగపూర్‌లను ఈ జాబితాలో చేర్చింది. అంటే ఆయా దేశాల కరెన్సీ విలువ కృత్రిమంగా తగ్గించే చర్యలపై నిఘా పెట్టనుంది. చైనాను మాత్రం మానిప్యులేటర్‌గా ఇప్పటికీ పరిగణించడం లేదు. తక్కువ విలువలో ట్రేడవుతున్న కరెన్సీ దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై వాణిజ్య ఆంక్షలు విధించాలంటూ అమెరికా కంపెనీలు కోరేందుకు అనుమతించాలంటూ అక్కడి వాణిజ్య శాఖ గత నెల 23న ప్రతిపాదించింది. స్వతంత్ర సెంట్రల్‌ బ్యాంకులు లేదా వాటి ద్రవ్య విధాన నిర్ణయాలను లక్ష్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ విధమైన కరెన్సీ మానిప్యులేషన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా మరింత ఒత్తిడితో కూడిన విధానాన్ని భాగస్వామ్య దేశాలతో అనుసరించాలని ఎంతో మంది ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు.  You may be interested

సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో ప్రారంభం

Thursday 20th June 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 39010 వద్ద, నిఫ్టీ  25 పాయింట్లు క్షీణించి 11666.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిన్నరాత్రి కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. అయితే ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమన అంశాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో అవసరమైతే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ తెలిపారు. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా

నిఫ్టీ పుల్‌ బ్యాక్‌కు అవకాశం!

Thursday 20th June 2019

నిఫ్టీ50 బుధవారం పూర్తిగా అస్థిరంగా చలించింది. 177 పాయింట్ల శ్రేణిలో రెండు వైపులా కదలాడింది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేటు నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించారు. అయితే, పుల్‌బ్యాక్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు.   నిఫ్టీ ఉదయం 53 పాయింట్ల లాభంతో 11,802 గరిష్ట స్థాయి వరకు పెరిగింది. ఆ తర్వాత లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. 11,625 వరకు చేరింది. చివరకు నష్టాలను పూర్తిగా కవర్‌

Most from this category