News


కరోనా ఎఫెక్ట్‌: దివాలా దిశగా విమానయాన సంస్థలు!

Monday 16th March 2020
news_main1584345649.png-32505

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తుండడంతో మే నెల చివరినాటికి విమానయాన సంస్థలన్నీ దివాలా తీస్తాయని గ్లోబల్‌ ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సీఏపీఏ వెల్లడించింది. ఆయా దేశాల ప్రభుత్వాలు విమానయాన సంస్థలతో కలిసి వెంటనే  చర్యలు చేపడితే విపత్తునుంచి తప్పించుకునే అవకాశం ఉందని  తెలిపింది. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు సాంకేతికంగా దివాలా తీసాయని, రుణ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు తమ సేవలను తగ్గించాయి. ఉదాహరణకు అట్లాంటా కేంద్రంగా సేవలందిస్తోన్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ 300 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే 40శాతం విమానాలు సేవలను అందించవు. యూకే, ఐర్లాండ్‌ మినహా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం, మరోపక్క భారత ప్రభుత్వం కూడా  మార్చి 11 లేదా అంతుకుముందు జారీ చేసిన పర్యాటక వీసాలను నిలిపివేయడం వంటి చర్యలతో 2020 మే చివరి నాటికి విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని సీఏపీఏ స్పష్టం చేసింది. నగదు నిల్వలు తగ్గిపోతుండడంతో విమాన యాన సంస్థలు సగం సేవల్ని నిలిపివేశాయి. భవిషత్‌ ప్రయాణాలకు టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులు సైతం ప్రభుత్వాల సూచనలకు లోబడి టికెట్లు బుక్‌ చేసుకోవడం లేదు.  దీంతో ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా డిమాండ్‌ పడిపోయిందని పేర్కొంది.ఇండియాలో అతిపెద్ద విమాన యాన సంస్థ అయిన ఇండిగో 260 విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 15-20 శాతం రోజూవారి బుకింగ్స్‌ తగ్గాయి. ప్రయాణికులు తగ్గడం, సర్వీసులు నిలిపివేయడం తదితర అంశాల వల్ల త్రైమాసిక ఫలితాలు కూడా క్షీణించే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయకపోతే ఎయిర్‌లైన్స్‌ సంస్థలు దివాలా తీసి ఈ రంగంలో పోటీలేకుండా పోతుందని సీఏపీఏపేర్కొంది.



You may be interested

19 నుంచి యస్‌ బ్యాంక్‌ పూర్తి సేవలు

Monday 16th March 2020

అనేక రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రైవేటురంగ రుణ దాత యస్‌ బ్యాంక్‌ పూర్తి స్థాయి సేవలు మార్చి 18నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1132 బ్రాంచ్‌లలో మార్చి 19 ఉదయం నుంచి తమ ఖాతాదారులకు సేవలను అందించనున్నట్లు యస్‌బ్యాంక్‌ ట్వీటర్‌ ద్వారా వెల్లడించింది. అన్నిరకాల డిజిటల్‌ సేవల్ని కూడా పొందవచ్చని తెలిపింది. యస్‌బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన మారటోరియంను మార్చి 18న ఎత్తివేయనుండడంతో బ్యాంకు యధాతధంగా సేవలను అందించనుందని తెలిపింది.

యస్‌బ్యాంక్‌ 58శాతం జంప్‌..!

Monday 16th March 2020

మార్కెట్‌ భారీ పతనంలో యస్‌ భారీగా ర్యాలీ చేస్తోంది. బీఎస్‌ఈలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 53శాతం పెరిగింది. నేడు ఈ షేరు రూ.23.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంక్షోభంలో ఉన్న బ్యాంక్‌ను గట్టిక్కించేందుకు ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు వాటాల కొనుగోలు చేసేందుకు రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. దీంతో

Most from this category