STOCKS

News


వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..

Tuesday 29th October 2019
news_main1572319723.png-29191

  • ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరం
  • భారత్‌కు ఏటా 6 బిలియన్ డాలర్ల సహాయం కొనసాగుతుంది
  • ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్‌పాస్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్‌పాస్ పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలు, నవకల్పనలు భారత వృద్ధికి కీలకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, 2024-25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే.. ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరమని డేవిడ్ తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించినా.. బ్యాంకింగ్ రంగం, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్‌బీఎఫ్‌సీ), క్యాపిటల్ మార్కెట్ల వంటి వాటి విషయంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. "మూడు ప్రధాన రంగాల్లో పురోగతి సాధించాలి. ముందుగా ప్రైవేట్ రంగం సహా బ్యాంకింగ్ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు అందించాలి. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌, తనఖా రుణాల మార్కెట్‌ మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థతో పాటే ఎదిగిన ఎన్‌బీఎఫ్‌సీల్లో రిస్కులు ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలి. సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే.. దేశ వృద్ధికి కీలకమైన ఆర్థిక రంగం మరింత మెరుగుపడుతుంది" అని డేవిడ్ పేర్కొన్నారు. ఇక, వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో గత మూడేళ్లుగా భారత్ టాప్ 10లో ఉంటోందని, ఈసారి 140వ స్థానం నుంచి 63వ స్థానానికి చేరిందని ఆయన చెప్పారు. కాంట్రాక్టుల అమలు, ప్రాపర్టీ నమోదు, స్థల సేకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ట్యాక్స్ రేటు కోతతో వృద్ధికి ఊతం..
కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ఇది మరింత వృద్ధికి దోహదపడగలదని డేవిడ్‌ చెప్పారు. బ్రెగ్జిట్‌తో పాటు వాణిజ్యపరమైన అనిశ్చితి పరిస్థితులు ప్రపంచ దేశాల వృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. "దీన్నుంచి బైటపడేందుకు, అధిక వృద్ధి సాధనకు ఆయా దేశాలు తమ సొంత వ్యూహాలు అమలు చేయాలి. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం ద్వారా భారత్ సరైన చర్యే తీసుకుంది. ఇది మరింత వృద్ధికి తోడ్పాటునివ్వవచ్చు" అని వివరించారు. 

భారత్‌లో 97 ప్రాజెక్టులు ..
ప్రస్తుతం భారత్‌లో 97 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందిస్తోందని డేవిడ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం 24 బిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో సంస్కరణలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ఇకపైనా కొనసాగుతుందన్నారు. ఏటా 5-6 బిలియన్ డాలర్లు అందించనున్నట్లు డేవిడ్ పేర్కొన్నారు. భారత పర్యటనకు వచ్చిన డేవిడ్‌ మల్‌పాస్‌.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కూడా భేటీ అయ్యారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి రుణాలు, ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడానికి తీసుకోతగిన చర్యలు, ప్రాంతీయంగా కనెక్టివిటీని మెరుగుపర్చడం, పౌర సేవల విధానాల్లో సంస్కరణలు తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు డేవిడ్ చెప్పారు. నీరు, శిక్షణల గురించి కూడా చర్చించామని, ఆయా అంశాలపై ప్రధాని దార్శనికత ప్రశంసనీయమని తెలిపారు. You may be interested

లాభాల ప్రారంభం

Tuesday 29th October 2019

ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌లో 2076 హిందూ నామ సంవత్సరాన్ని శుభారంభం చేసిన స్టాక్‌ సూచీలు ఒక రోజు సెలవు అనంతరం మంగళవారం తిరిగి లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల పెరుగుదలతో 39,300 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,644 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కివస్తున్నదంటూ ఇరుదేశాల అధికారులూ చేసిన ‍ప్రకటనలు, యూరోపియన్‌ యూనియన్‌ బ్రెగ్జిట్‌ గడువును జనవరి 31

రూ.7,614 కోట్లు సమీకరించిన జీవీకే

Tuesday 29th October 2019

విమానాశ్రయ వ్యాపారంలో వాటా విక్రయం ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంపు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మౌలిక రంగంలో ఉన్న జీవీకే గ్రూప్‌ రుణ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌లో 79.1 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ.7,614 కోట్లు సమీకరించింది. అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ (పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్‌), నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో (ఎన్‌ఐఐఎఫ్‌) ఈ

Most from this category