News


అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్‌

Saturday 14th December 2019
news_main1576295837.png-30221

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్‌ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పెంచబోతున్నట్టు తన కార్యాలయం మినహా అంతటా వదంతులు వ్యాప్తి చెందుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ నెల 18న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ పరిహార బకాయిలపై అవగాహన ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు. ఆర్థిక రంగం ఎప్పుడు పుంజుకోవచ్చంటూ ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ‘‘నేను ఎటువంటి అంచనాలు వేయను. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాను. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది’’ అని వివరించారు. స్టాగ్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం పెరుగుతూ, వృద్ధి తగ్గుతుండడం)పై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ భారత్‌ స్టాగ్‌ఫ్లేషన్‌ దశలోకి వెళుతోందని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. 
ధరలు దిగొస్తున్నాయి...
ఉల్లిపాయల దిగుమతులతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధరలు దిగొస్తున్నట్టు మంత్రి చెప్పారు. తాజా పంట దిగుబడులు కూడా మార్కెట్‌కు చేరితే  ధరలు మరింత తగ్గుముఖం పడతాయన్నారు. మంత్రుల బృందం నిరంతరం ఉల్లిధరలను సమీక్షిస్తున్నట్టు తెలిపారు. 
వినియోగం పెంపుపై ప్రభుత్వం దృష్టి
దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం వినియోగం పెంపుపై దృష్టి సారించినట్టు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఈ సమావేశంలో తెలిపారు. దేశ ఆర్థిక రంగ స్థితిపై ఆయన వివరాలు తెలియజేశారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆగస్ట్‌ నుంచి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇవి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరిన జీడీపీ వృద్ధిని పైకి తీసుకొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  



You may be interested

ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు

Saturday 14th December 2019

2019-20 సంవత్సరంపై సీఏపీఏ తాజా అంచనా న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 600 మిలియన్‌ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను మూటగట్టుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500-700 మిలియన్‌ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను ఈ సంస్థ పూర్తిగా మార్చేసింది. ఇండిగో, గోఎయిర్‌, స్పైస్‌జెట్‌, ఎయిరేషియా ఇండియా,

వరుసగా నాల్గవ నెలా ఎగుమతులు ‘మైనస్‌’

Saturday 14th December 2019

నవంబర్‌లో వృద్ధిలేకపోగా 0.34 శాతం క్షీణత విలువ రూపంలో 25.98 బిలియన్‌ డాలర్లు దిగుమతులూ క్షీణతలోనే... విలువ 38.11 బిలియన్‌ డాలర్లు వెరసి వాణిజ్యలోటు 12 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా నాల్గవ నెలా నిరాశనే మిగిల్చాయి. అసలు వృద్ధిలేకపోగా -34 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 25.98 బలియన్‌ డాలర్లు. ఇక దిగుమతులూ క్షీణ బాటలో ఉన్నాయి. -12.71 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి దిగుమతులు విలువ 38.11 బిలియన్‌

Most from this category