News


ఉద్యోగులను తొలగిస్తున్న ఆటో కంపెనీలు!

Saturday 31st August 2019
news_main1567233423.png-28128

 వరుసగా తొమ్మిదివ నెలలో(జులై) కూడా వాహనాల అమ్మకాలు క్షీణించడంతో దేశియ ఆటో రంగ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అంతేకాకుండా ఖర్చులను అదుపులో ఉంచడానికి తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయని రాయిటర్స్ ఓ నివేదికలో పేర్కొంది. క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోడానికి జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ తమ కంపెనీల ఉత్పత్తిలో కొన్ని భాగాలను నిలిపివేశాయని రాయిటర్స్‌ తెలిపింది. జూలై నెలలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాలలో ఎక్కువగా పడిపోయాయి. ఫలితంగా చాలా వరకు దేశియ వాహన తయారి సంస్థలు, ఉద్యోగాల కోతను విధించడంతో పాటు, షిఫ్టులను తగ్గించుకోవడం, ప్లాంట్‌లను తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలను తీసుకుంటున్నాయి. ఆర్థిక మందగమనం తీవ్రతరం కావడంతో ప్రస్తుతం మరిన్ని కంపెనీలు తాత్కాలిక కార్మికులను తొలగించడం ప్రారంభించాయని రాయిటర్స్‌ తెలిపింది. 
   కార్ల కోసం పవర్‌ట్రెయిన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తయారుచేసే డెన్సో కార్ప్ ఇండియా యూనిట్,  తన మానేసర్(ఉత్తర భారతదేశం) ప్లాంట్‌లో కొంతమంది తాత్కాలిక కార్మికులను తగ్గించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. కాగా ఈ సమాచారం తప్పని డెన్సో కార్పో ఖండించింది. ఆటో ఫ్రేమ్‌వర్క్ భాగాలను తయారుచేసే బెల్సోనికా తమ ఉద్యోగులను తగ్గించుకున్నట్లు రాయిటర్స్‌ పేర్కొం‍ది. తగ్గించుకున్న ఉద్యోగులు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేవాళ్లని బెల్సోనికా ఒక ఈ-మెయిల్‌ ద్వారా పేర్కొంది. వాహన తయారీదారులు, కాంపోనెంట్ తయారీదారులు, డీలర్లు ఇప్పటికే 350,000 ఉద్యోగాలకు కోత విధించారని ఈ నెల ప్రారంభంలో రాయిటర్స్‌ పేర్కొంది. కాగా అమ్మకాలను పునరుద్ధరించే చర్యలలో భాగంగా వాహనాలపై జీఎస్‌టీ రేటును తగ్గించాలని, కొనుగోలుదారులు, డీలర్లకు రుణ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని అగష్టు 7న జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను వాహన రంగ ప్రతినిధులు కోరిన విషయం తెలిసిందే. 
    కంపెనీకి సరళమైన ఉత్పత్తి వ్యవస్థ ఉన్నప్పటికీ, స్టాక్ పెరగకుండా నిరోధించడానికి ఆగస్టులో ఐదు రోజులలో ఉత్పత్తిని నిలిపివేశామని టయోటా ఇండియా యూనిట్‌, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రాజా రాయిటర్స్‌కు తెలిపారు. ప్రతికూలంగా ఉన్న వినియోగదారుల సెంటిమెంట్‌ ఈ రంగాన్ని వేధిస్తుందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత ఊరటనిస్తాయని తెలిపారు. బాడీ షాప్, పెయింట్ షాపుతో పాటు ఇంజిన్, ట్రాన్స్మిషన్ ప్లాంట్లతో సహా వివిధ విభాగాలలో ఆగస్టులో కొన్ని రోజులు ఉత్పత్తిని నిలిపివేయనున్నామని ఆగస్టు 9 న హ్యుందాయ్ ఒక మెమోలో పేర్కొంది.  ‘వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే పండుగ సీజన్లో అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. కంపెనీ ఎటువంటి కార్మికులను తొలగించలేదు’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రతినిధి తెలిపారు.You may be interested

42 పాయింట్ల నష్టపోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 31st August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లో ముగిసింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ముగిసే సరికి 11,012.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11058.90 పాయింట్లతో పోలిస్తే 47 పాయింట్ల నష్టంతో, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 42 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొండిబాకీలతో కుదేలవుతున్న

రూ.5.47 లక్షల కోట్లకు ద్రవ్యలోటు

Saturday 31st August 2019

బడ్జెట్‌ అంచనాల్లో ఇప్పటికే 77.8 శాతానికి చేరిక న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు జూలై నాటికి రూ.5,47,605 లక్షల కోట్లకు చేరింది. 2019-20 మొత్తం బడ్జెట్‌ లక్ష్యంలో 77.8 శాతానికి చేరింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ తాజా గణాంకాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలకు ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ (2018-19) అంచనాల్లో 86.5 శాతంగా ఉంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు

Most from this category