News


'ఆటో'లో మరిన్ని మూసివేతలు

Saturday 17th August 2019
news_main1566016719.png-27819

 

  • తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపివేసిన హీరో, సుందరం క్లేటన్‌
  • హీరో ప్లాంటు 4 రోజుల పాటు మూసివేత

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌, సుందరం-క్లేటన్ (ఎస్‌సీఎల్‌) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్‌ ఆగస్టు 15-18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. "స్వాతంత్ర్య దినోత్సవం, రక్షా బంధన్‌, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం" అని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్‌ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్‌సీఎల్‌ కూడా 'పాడి'లోని ప్లాంటులో ఆగస్టు 16,17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్‌ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. You may be interested

గుడ్‌బై ... ఎయిరిండియా..!

Saturday 17th August 2019

95 శాతం వాటాల అమ్మకం ప్రైవేటీకరణ నిబంధనలు కూడా సడలింపు వాటాలు తక్షణం అమ్ముకోవడానికి  కొనుగోలుదారులకు వెసులుబాటు విక్రయ ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు అక్టోబర్‌ నాటికి ఈవోఐ న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రక్రియను ఈసారైనా కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడంపై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశం

ఈ కంపెనీల లాభం రెట్టింపయ్యెను

Friday 16th August 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికానికి సంబంధించి ఫలితాల సీజన్‌ దాదాపు ముగిసినట్టే. ఏవో కొన్ని కంపెనీలను మినహాయిస్తే చాలా కంపెనీలు ఇప్పటికే ఫలితాలను ప్రకటించేశాయి. ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు అంచనాలకు మించి మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. ఆటో, ఆటో యాన్సిలరీ, మధ్యస్థాయి ఐటీ కంపెనీల ఫలితాల్లో మాత్రం వృద్ధి అంచనాలు మిస్సయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 కంపెనీల లాభం పెరగ్గా, ఇతర కంపెనీల లాభం

Most from this category