News


యస్ బ్యాంక్‌కు డౌన్‌గ్రేడ్ గండం!!

Thursday 7th November 2019
news_main1573097841.png-29407

ముంబై: మొండిపద్దులు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌కు రేటింగ్‌పరమైన ముప్పు కూడా పొంచి ఉంది. బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తాజాగా హెచ్చరించింది. రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేకపోవడం, కేవలం 1.2 బిలియన్ డాలర్ల నిధులే సమీకరించనుండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ రేటింగ్‌ను సమీక్ష జరుపుతున్నామని, ప్రస్తుతమున్న బీఏ3 నుంచి తగ్గించే అవకాశాలూ ఉన్నాయని మూడీస్ వెల్లడించింది. బ్యాంకు సొంత లెక్కలు బట్టి చూసినా ఈ ఏడాది మొండి బాకీలు 12 శాతంపైగానే ఉండేలా కనిపిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, యస్‌ బ్యాంక్ కొత్తగా 'యస్ ఫిన్‌టెక్‌ డెవలపర్‌' పేరిట ఏపీఐ డెవలపర్ ‍ప్లాట్‌ఫాం ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఇది దేశీయంగా అతి పెద్ద బ్యాంకింగ్ ఏపీఐ డెవలపర్‌ ప్లాట్‌ఫాం అని, క్లయింట్లకు మెరుగైన డిజిటల్ సేవలు అందించే సాధనాల రూపకల్పనకు తోడ్పడగలదని పేర్కొంది. 



You may be interested

12,000పైన నిఫ్టీ ప్రారంభం

Thursday 7th November 2019

గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను, ట్రేడర్లను ఊరిస్తున్న 12,000 పాయింట్ల స్థాయిని గురువారం ప్రారంభంలో నిఫ్టీ అందుకున్నది. ఈ సూచి ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలకే 49 పాయింట్లు జంప్‌చేసి 12,015 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 180 పాయింట్ల లాభంతో మరో కొత్త రికార్డుస్థాయి 40,655 పాయింట్ల వద్దకు చేరింది. 

విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వక ఎగవేతదారుడే..!

Thursday 7th November 2019

ఐడీబీఐ తాజా ప్రకటన న్యూఢిల్లీ: లిక్కర్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వక ఎగవేతదారుడని తాజాగా ఐడీబీఐ ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు హామీదారు, డైరెక్టర్‌ హోదాలో ఆయన బ్యాంక్‌ నుంచి రూ. 1,566 కోట్లను రుణంగా పొంది, ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని వివరించింది. అక్టోబర్‌ 2018 నాటికి ఈ మొత్తం చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. మాల్యా పాత పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను ముద్రించి బుధవారం ఈ మేరుకు ఒక ప్రకటనను ఐడీబీఐ

Most from this category