News


మార్కెట్‌పై మూడీస్‌ ప్రభావం తాత్కాలికమే!

Monday 11th November 2019
news_main1573454363.png-29503

బుల్‌ రన్‌ కొనసాగుతుంది
 నిపుణుల అంచనా
భారత ఎకానమీ అవుట్‌లుక్‌ను మూడీస్‌ రేటింగ్‌ ఏజన్సీ డౌన్‌గ్రేడ్‌ చేసిన ప్రభావం మార్కెట్‌పై స్వల్పకాలమే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిస్కులు పెరిగాయని చెబుతూ గతవారం మూడీస్‌ సంస్థ భారత క్రెడిట్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే! దీంతో మార్కెట్లు నెగిటివ్‌గా రియాక్టయ్యాయి. కానీ త్వరలో ఈ ప్రభావం సమసి పోతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణాత్మక చర్యలు మార్కెట్లో జోష్‌ తెస్తాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. గత ఆగస్టు నుంచి ప్రభుత్వం పలు సంస్కరణలను ప్రకటిస్తూ వస్తోంది. ఇవన్నీ త్వరలో ఫలితాలు చూపుతాయని నిపుణుల భావన. ఈ చర్యలతో ఇండియా ఇంక్‌ ఎర్నింగ్స్‌ మెరుగవడమే కాకుండా ఎకానమీలో వృద్ధి సైతం పట్టాలెక్కుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల మధ్యలో చిన్నపాటి కరెక‌్షన్స్‌, కన్సాలిడేషన్లతో మార్కెట్లు ముందుకే పయనిస్తాయని చెబుతున్నారు. 
ఎవరేమంటున్నారు....
= కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ప్రభుత్వఆదాయం తగ్గి విత్తలోటు పెరగవచ్చన్న భయాలున్నాయని, కానీ అనుకున్నదానికన్నా మరింత జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ సాగితే ఈ లోటు భయాలు తీరుతాయని నార్నొలియా అనలిస్టు శైలేంద్ర కుమార్‌ చెప్పారు. మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ కారణంగా బాండ్‌ ఈల్డ్స్‌ బలపడి, రూపీ పతనమైతే నిఫ్టీ సైతం కొంత మేర పతనం కావచ్చని, కానీ రాబోయే కాలం మాత్రం ఇండియా ఈక్విటీలకు ఎంతో పాజిటివ్‌గా ఉందని ఆయన చెప్పారు. 
= రెలిగేర్‌ రిసెర్చ్‌ అనలిస్టు అజిత్‌ మిశ్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడీస్‌ ప్రభావం తాత్కాలికమేనని, భవిష్యత్‌లో దేశీయ మార్కెట్స్‌ జోష్‌ చూపుతాయని తెలిపారు. ట్రేడ్‌డీల్‌ కుదరడం లాంటి అంతర్జాతీయ పాజిటివ్‌ అంశాలకు తోడు సంస్కరణల్లాంటి దేశీయ పాజిటివ్‌ అంశాల ప్రభావం మార్కెట్‌ను ముందుకే నడిపిస్తుందన్నారు. 
= మూడీస్‌ నిర్ణయం మొత్తం మార్కెట్‌ ప్రదర్శనను మార్చివేయలేదని, ఈ నివేదిక పాత గణాంకాలతో రూపొందించినదని, ఇవన్నీ మార్కెట్‌ ఎప్పుడో జీర్ణించుకుందని జియోజిత్‌ అనలిస్టు వినోద్‌ నాయర్‌ చెప్పారు. మూడీస్‌ నిర్ణయం ఎక్కువగా బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని, విత్త సమస్యలు విస్తృతమైతే అప్పుడు ఈక్విటీ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేయవచ్చని తెలిపారు. కానీ ఇందుకు అవకాశాలు పరిమితమన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, స్పెక్ట్రం అమ్మకం, డివిడెండ్స్‌తో విత్తలోటు పెరగకపోవచ్చన్నారు. మార్కెట్‌లో కాస్త ఆందోళన కలిగించే అంశం పెద్ద షేర్ల వాల్యూషన్లని చెప్పారు. నిప్టీ ఏడాదిలో 12600ను తాకుతుందని అంచనా వేశారు. క్రమానుగత పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని సూచించారు. You may be interested

రెండేళ్లలో లార్జ్‌క్యాప్స్‌ను మించి మిడ్‌క్యాప్స్‌ లాభాలు!

Monday 11th November 2019

 ‘మిడ్‌క్యాప్స్‌ సెక్టార్‌ యూ ఆకారపు రికవరికి సిద్ధంగా ఉందని అంచనావేస్తున్నాం. జీడీపీ వృద్ధి చెందితే ఈ స్టాకులు కూడా మంచి ప్రధర్శన  చేయడం గమనించవచ్చు. ముందుకెళ్లే కొద్ది జీడీపీ రికవరి అవుతుందనే అంచనాలున్నాయి. ఈ రికవరి విస్తృతంగా ఉంటే, ఇంకో రెండుమూడేళ్లలో మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌ క్యాప్‌లను మించి ప్రదర్శన చేస్తాయి’ అని యాక్సిస్‌ క్యాపిటల్‌, రీసెర్చ్‌ హెడ్‌, కశ్యప్‌ పుజారా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోలు మద్దతు

Monday 11th November 2019

మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో.... ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 1.50శాతం లాభపడింది. ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 5.50శాతం లాభపడింది. శుక్రవారం మెరుగైన ఫలితాలు ప్రకటించడటం షేరు ర్యాలీకి కారణమైంది. అలాగే బ్యాంక్‌ ఇండియా 2శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1శాతం, పంజాబ్‌ నేషనల్‌

Most from this category