News


టాటా మోటార్స్‌ సీఎఫ్‌ఆర్‌ రేటింగ్‌ తగ్గింపు

Friday 21st June 2019
news_main1561098921.png-26470

  • జేఎల్‌ఆర్‌ బలహీన పనితీరే కారణం 
  • మూడీస్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌(సీఎఫ్‌ఆర్‌)ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, మూడీస్‌ తగ్గించింది. అంతే కాకుండా సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను కూడా తగ్గించింది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ పనితీరు బలహీనంగా ఉండటంతో కంపెనీ రుణ స్థితిగతులు దిగజారడం కొనసాగుతోందని, అందుకే రేటింగ్‌ను తగ్గించామని మూడీస్‌ పేర్కొంది. టాటా మోటార్స్‌ అవుట్‌లుక్‌ను ప్రతికూలం స్థాయిలోనే కొనసాగిస్తున్నామని తెలిపింది. కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లోస్‌ సానుకూల స్థితికి రావడానికి అంచనాల కంటే ఎక్కువ కాలమే పడుతుందని పేర్కొంది. చైనా మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలు, యూరప్‌లో డీజిల్‌ కార్ల అమ్మకాలు తగ్గుతుండటం, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటం, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు పెడుతుండటం...ఈ అంశాలన్నీ జేఎల్‌ఆర్‌ ఫ్రీ క్యాష్‌ ప్లోస్‌పై  తీవ్రమైన ఒత్తిడినే పెంచుతున్నాయని మూడీస్‌ వివరించింది. 


టాటా మోటార్స్‌ సీఎఫ్‌ఆర్‌ రేటింగ్‌ను, సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను బీఏ3 నుంచి బీఏ2కు తగ్గించామని మూడీస్‌ తెలిపింది. ఈ రెండు రేటింగ్‌లు స్పెక్యులేటివ్‌ అంశాలను, చెప్పుకోదగ్గ క్రెడిట్‌ రిస్క్‌ను సూచిస్తాయి.



You may be interested

ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

Friday 21st June 2019

- అక్టోబర్‌ నుంచి పెరగనున్న పెట్టుబడుల పరిమితి - ఎంసీఎఫ్‌ఐ ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: అమెరికాలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అక్కడ స్థానికత్వ ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడే ప్రస్తుత ఈబీ5 విధానం గడువు త్వరలో ముగిసిపోనుందని మేరీల్యాండ్‌ సెంటర్‌ ఫర్‌ ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎంసీఎఫ్‌ఐ) ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు తెలిపారు. ప్రస్తుత విధానం కింద 5 లక్షల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ సరిపోతుందని కొత్తగా అక్టోబర్‌ నుంచి

ఫిచ్‌ బాటలోనే డీబీఎస్‌

Friday 21st June 2019

2019-20లో భారత్‌ వృద్ధి అంచనా కోత  7 శాతం నుంచి 6.8 శాతానికి డౌన్‌ సింగపూర్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రముఖ బ్యాంకింగ్‌ సేవల సంస్థ- డీబీఎస్‌ కుదించింది. 2019- 2020లో కేవలం 6.8 శాతమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకూ ఈ అంచనాలను డీబీఎస్‌ 7 శాతంగా పేర్కొంది. ఇటీవలే అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ- ఫిచ్‌ 2019- 20 వృద్ధి

Most from this category