News


హెచ్‌ఎంఈఎల్‌ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్‌!

Wednesday 26th February 2020
news_main1582714176.png-32114

ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌  సంస్థ  హెచ్‌పీసీఎల్‌-మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(హెచ్‌ఎంఈఎల్‌) రేటింగ్‌ను Ba1 నుంచి Ba2కు తగ్గించింది. స్టేబుల్‌గా ఉన్న ర్యాంకింగ్‌ను నెగిటివ్‌గా మార్చింది. ఇంధన డిమాండ్‌ తగ్గడం, రిఫైనింగ్‌​మార్జిన్స్‌ బలహీనంగా ఉండడంతో  రేటింగ్‌ను తగ్గించినట్లు మూడీస్‌ సంస్థ తెలిపింది.హెచ్‌ఎంఈఎల్‌ క్రెడిట్‌ మెట్రిక్స్‌ క్షీణత, ఆసియాలో రిఫైనింగ్‌ బలహీనపడడం, కంపెనీలు పెట్రోకెమికల్స్‌ విస్తరించేందుకు అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడాన్ని ..తగ్గించిన రేటింగ్‌ Ba2 ప్రతిబింబిస్తుందని మూడీస్‌ విశ్లేషకులు శ్వేతా పటోడియా అన్నారు. ​బలహీనమైన ఇండస్ట్రీ పరిస్థితులు సింగపూర్‌ బెంచ్‌మార్క్‌ రిఫైనింగ్‌ మార్జిన్స్‌ను ప్రతిబింబిస్తున్నాయని, చారిత్రిక సగటు బ్యారెల్‌ 6-7 డాలర్లతో పోలిస్తే 2019లో బ్యారెల్‌ 3.7 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ సముద్ర సంస్థలు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టి సముద్ర రవాణాలో అధిక ఇంధన వాడకాన్ని నియంత్రించాయి. దీంతో ఇంధన వాడకం తగ్గిందని పటోడియా పేర్కొన్నారు. పంజాబ్‌లోని భటిండా 11.3 మిలియన్‌ టన్నుల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్న హెఎంఈఎల్‌ సంస్థ 1.2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల  సామర్థ్యం కలిగిన డ్యూయల్‌ ఫీడ్‌ పెట్రో కెమికల్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ ప్రాజెక్టును 2017 అక్టోబర్‌లో ప్రారంభించి 2022 మార్చినాటికి పూర్తి చేయాలనుకుంది.కానీ మూలధనాన్ని పెంచి ప్రస్తుతం 2021 ఏప్రిల్‌కే పూర్తి చేయనుందని పటోడియా తెలిపారు. అయితే దీనికోసం వ్యయాన్ని ఏమీ పెంచలేదనీ మొదట నిర్ణయించిన మొత్తంలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయనుంది.2020 జనవరి నుంచి షిప్పింగ్‌ ఇండస్ట్రీలో ఇంధన వాడకం నిబంధనలు మరింత సంక్లిష్టం చేయడంతో కొం‍త వరకు ఇది హెచ్‌పీసీఎల్‌కు అనుకూలిస్తుందని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావంతో డిమాండ్‌ తగ్గడం కూడా ఇందుకు ఒక కారణమని, అందుకే  ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో తాత్కాలికంగా రిఫైనరీని మూసివేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు.

    
               You may be interested

ఎల్‌ఐసీ ఐపీఓ బీమారంగానికి ప్రయోజనమే!

Wednesday 26th February 2020

ఫిచ్‌ రేటింగ్స్‌ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఐపీఓకు రావడం శుభపరిణామని బుధవారం ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అభిప్రాయపడింది. ఐపీఓ కారణంగా ఎల్‌ఐసీ పారదర్శకత, జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని రేటింగ్‌ సంస్థ తెలిపింది. అలాగే దేశీయ బీమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దేశీయ బీమారంగం కొంత వెనకబడింది. ఎల్ఐసీ లాంటి పెద్ద బీమా సంస్థ ఐపీఓ రానున్న నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు బీమారంగంలో తన పెట్టుబడుల

కరోనా కలకలం- మార్కెట్‌ వికలం

Wednesday 26th February 2020

392 పాయింట్లు పడిన సెన్సెక్స్‌  నిఫ్టీ 119 పాయింట్ల వెనకడుగు  ఆటో, రియల్టీ, మెటల్‌, ఐటీ డీలా  కరోనా ధాటికి అమెరికా సైతం అప్రమత్తతను ప్రకటించవలసిన పరిస్థితులు తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లకు షాక్‌ తగిలింది. మంగళవారం వరుసగా రెండో రోజు అమెరికా మార్కెట్లు 3 శాతం తిరోగమించాయి. దీంతో దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. వెరసి సెన్సెక్స్‌ 392 పాయింట్లు పతనమై 39,889 వద్ద నిలవగా.. 119 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

Most from this category