News


యస్ బ్యాంక్ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 28th November 2018
news_main1543389316.png-22435

న్యూఢిల్లీ: కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియ, డైరెక్టర్ల రాజీనామాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌పై వివాదాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌కు తాజాగా రేటింగ్‌పరమైన ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ రేటింగ్‌ను నాన్‌-ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌కి కుదించినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. అలాగే అవుట్‌లుక్‌ కూడా స్థిర స్థాయి నుంచి నెగటివ్‌ స్థాయికి తగ్గించినట్లు మంగళవారం పేర్కొంది. 
ప్రస్తుత ఎ౾ండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని రిజర్వ్ బ్యాంక్‌ జనవరి 31 దాకా పరిమితం చేసిన దరిమిలా పలువురు డైరెక్టర్లు వరుసగా రాజీనామాలు చేయడం.. బ్యాంకులో కార్పొరేట్ గవర్నెన్స్‌ విషయం ఆందోళన కలిగించేదిగా మారిందని మూడీస్ పేర్కొంది. "బ్యాంక్ నమోదు చేస్తున్న ఫలితాలను బట్టి చూస్తే రుణ మూలాలు పటిష్టంగానే ఉన్నాయి.. కానీ అధికార పగ్గాల మార్పిడి ప్రక్రియ చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలు, గవర్నెన్స్‌పరమైన అంశాలు పరపతికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. వీటివల్ల బ్యాంక్ దీర్ఘకాలిక వ్యూహాన్ని మేనేజ్‌మెంట్ సమర్ధంగా అమలు చేయడం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది" అని వివరించింది. అంతేగాకుండా ఈ పరిణామాల కారణంగా కొత్తగా మరింత మూలధనం సమీకరించే సామర్ధ్యాలపై కూడా ప్రతికూల ప్రభావం పడగలదని పేర్కొంది. విదేశీ కరెన్సీ ఇష్యుయర్ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏ1కి, బేస్‌లైన్ క్రెడిట్ అసెస్‍మెంట్‌ (బీసీఏ)ని 'బీఏ1' నుంచి బీఏ2కి తగ్గించింది. అంటే ఈ సాధనాలు పెట్టుబడికి అంతగా అనువు కావని, స్పెక్యులేటివ్ ధోరణిలో ఉంటాయని ఇవి తెలియజేస్తాయి. ఒకవేళ యస్‌ బ్యాంక్ గానీ విదేశాల నుంచి నిధుల సమీకరణలో సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో బ్యాంకు రుణ వితరణ సామర్ధ్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని మూడీస్‌ తెలిపింది. You may be interested

జపాన్‌ కంపెనీ చేతికి ఆటమ్‌ టెక్నాలజీస్‌

Wednesday 28th November 2018

ముంబై: భారత దేశ పేమెంట్‌ సేవల మార్కెట్లోకి జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా ప్రవేశించింది. 63-మూన్స్‌ యాజమాన్యంలోని చెల్లింపుల సేవల సంస్థ, ఆటమ్‌ టెక్నాలజీస్‌లో నియంత్రిత వాటాను ఎన్‌టీటటీ డేటా కొనుగోలు చేసింది. ఆటమ్‌ టెక్నాలజీస్‌లో 55.35 శాతం వాటాను 92.4 లక్షల డాలర్లకు ఎన్‌టీటీ డేటా కొనుగోలు చేసిందని 63 మూన్స్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌.రాజేంద్రన్‌ చెప్పారు. అంతేకాక ఈ జపాన్‌ సంస్థ మరో 15 లక్షల

భారత్‌లో వివో ఆర్‌అండ్‌డీ సెంటర్‌!

Wednesday 28th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్‌ టీమ్‌ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అంశంపై ఈ బృందం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ నిపుణ్‌ మార్యా తెలిపారు. వై95 మోడల్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా

Most from this category