News


20కిపైగా కంపెనీలకు మూడీస్‌ షాక్‌!

Friday 8th November 2019
news_main1573209786.png-29455

ప్రకటించిన మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌
భారత ఎకానమీ అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన మూడీస్‌ తాజాగా పలు షేర్ల అవుట్‌లుక్‌ను పునఃసమీక్షించింది. ఈ సమీక్షలో ఆరు ఫైనాన్షియల్‌ సంస్థలు, 15నాన్‌ఫైనాన్షియల్‌ సంస్థల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఐదు కంపెనీల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దేశీయ విత్త దిగ్గజాలైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎగ్జిమ్‌బ్యాంక్‌, హీరో ఫిన్‌కార్‌‍్ప, హడ్కో, ఐఆర్‌ఎఫ్‌సీ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి నెగిటివ్‌కి తగ్గించినట్లు మూడీస్‌ తెలిపింది. విత్తేతర సంస్థలైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌, పెట్రోనెట్‌ఎల్‌ఎన్‌జీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌హెచ్‌ఏఐ, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ గ్రీన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను సైతం నెగిటివ్‌కి తగ్గించింది. మరోవైపు బీఓఐ, కెనెరాబ్యాంక్‌, ఓబీసీ, సిండికేట్‌ బ్యాంక్‌, యూబీఐ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

ఎగ్జిమ్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐఆర్‌ఎఫ్‌సీ, హడ్కో రేటింగ్‌ అవుట్‌లుక్‌ తగ్గించడానికి ఈ కంపెనీలకు ప్రభుత్వంతో ఎక్కువ సంబంధం ఉండడమే కారణమని మూడీస్‌ వివరించింది. దేశ ఎకానమీ అవుట్‌లుక్‌ తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వంతో ఎక్కువ లింకులున్న వీటి అవుట్‌లుక్‌ను సైతం డౌన్‌గ్రేడ్‌ చేశామని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇచ్చిన రుణాల్లో ప్రభుత్వ రుణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఒక బ్యాంకు బీసీఏ అంచనాకు ఆ దేశ సార్వభౌమత్వ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది. ఈ రోజు డౌన్‌గ్రేడ్‌ జరిగిన కంపెనీల మేనేజ్‌మెంట్‌ లేదా గవర్నెన్స్‌పై తమకు ఎలాంటి సందేహాలు, ఆందోళనలు లేవని, కేవలం దేశ సార్వభౌమత్వ రేటింగ్‌ అవుట్‌లుక్‌ డౌన్‌గ్రేడ్‌తో ఇవి ప్రభావితం అవుతున్నాయని మూడీస్‌ వివరించింది. తాజాగా డౌన్‌గ్రేడ్‌ చెందిన విత్త సంస్థల అవుట్‌లుక్‌ను వచ్చే 12- 18 నెలల్లోపు పునఃసమీక్షించే అవకాశం లేదని తెలిపింది. అవుట్‌లుక్‌ తగ్గించినా గెయిల్‌ బీసీఏ(బేస్‌లైన్‌ క్రెడిట్‌ అసెస్‌మెంట్‌)ను మాత్రం బీఏఏఏ3 నుంచి బీఏఏఏ2కు అప్‌గ్రేడ్‌ చేసింది. You may be interested

ఆ దేవుడినే అడగండి..ఇన్ఫోసిస్‌పై సెబీ చీఫ్‌

Friday 8th November 2019

తాజాగా వార్షిక విశ్లేషకుల సమావేశంలో ‘దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడు’ అని వ్యాఖ్యానించిన ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నిలేకని వ్యాఖ్యలపై సెబీ(సెక్యురిటీస్‌, ఎక్సేంజ్‌ బోర్డు) చైర్మన్‌ అజయ్‌ త్యాగి స్పందించారు. సీఐఐ క్యాపిటల్‌ మార్కెట్‌ సమ్మిట్‌లో పాల్గోన్న అజయ్‌ త్యాగిని మీడియావారు ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు ‘అతన్నే మీరు అడగాలి(నిలేకని) లేదా దేవుడిని అడగాలి. నేను చెప్పడానికి ఏం లేదు’ అని వ్యాఖ్యాలు చేశారు. కాగా

కుబేరుల సంపద తగ్గింది!

Friday 8th November 2019

యూబీఎస్‌, పీడబ్ల్యుసీ నివేదిక  గతేడాది ప్రపంచ ధనికుల సంపద అంతకుముందేడాది(2017)తో పోలిస్తే తగ్గిందని యూబీఎస్‌ అండ్‌ పీడబ్ల్యుసీ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ టెన్షన్లు, ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకులు... బిలియనీర్ల సంపద తగ్గేందుకు దోహదం చేశాయని వివరించింది. ప్రపంచ ధనవంతుల సంపద తగ్గడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారని తెలిపింది. గతంలో 2008లో ప్రపంచ ధనికుల సంపద తరుగుదల నమోదు చేసింది. 2018లో అందరు కోటీశ్వరుల సంపద దాదాపు 40 కోట్ల డాలర్ల

Most from this category