News


చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వైద్యులకు ప్రధాని ప్రశంసలు

Tuesday 2nd July 2019
news_main1562053287.png-26739

న్యూఢిల్లీ: సమాజంలో నిజాయితీ సంస్కృతికి పాటుపడుతున్న చార్టర్డ్‌ అకౌంటెంట్ల సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘చార్టర్డ్‌ అకౌంటెంట్ల కష్టపడి పనిచేసే స్వభావం సమాజంలో నిజాయితీ సంస్కృతి, మెగురైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను ముందుకు తీసుకెళుతుంది’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక సౌభాగ్యం ఫరిడవిల్లే విషయంలోనూ చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఇక వైద్యుల దినోత్సవం సందర్భంగా  సమాజాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచేందుకు రోజులో అన్ని సమయాల్లోనూ పాటుపడుతున్న డాక్టర్ల సేవలకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘ప్రజా సంక్షేమం కోసం వారి చిరస్మరణీయ సేవలకు ఏ పదాలు కూడా న్యాయం చేయలేవు. విశిష్ట వైద్యుడు డాక్టర్‌ బీసీ రాయ్‌కు నివాళులు అర్పిస్తున్నాను’’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. డాక్టర్‌ బీసీ రాయ్‌ జయంతిని వైద్యుల దినంగా జరుపుకుంటారు.



You may be interested

రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2.5 లక్షల కోట్లు!

Tuesday 2nd July 2019

అనధికార మార్కెట్లో భారీ ధరకు లావాదేవీలు రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో నమోదుకానుందనే వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లకు అనధికార మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. రిటైల్‌ రంగంలోని మిగిలిన కంపెనీల కంటే ఈ కంపెనీ విలువ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అనధికార మార్కెట్లో ఈ షేరు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లకు చేరిందని,  నమోదైనా ఏడు ప్రత్యర్థి కంపెనీల మొత్తం మార్కెట్‌క్యాప్‌ కంటే  75 శాతం ఎక్కువని భావిస్తున్నారు.

జూన్‌లో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

Tuesday 2nd July 2019

రూ.99,939 కోట్లకు పరిమితం అంతక్రితం మాసంలో రూ.లక్ష కోట్లు న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కుపైన స్థిరంగా కొనసాగడం లేదు. మే నెలలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1,00,289 కోట్లు వసూలు కాగా, జూన్‌లో రూ.99,939 కోట్లకు తగ్గాయి. దీంతో అంతకుముందు మూడు నెలల పాటు నమోదైన రూ.లక్ష కోట్ల మార్క్‌కు బ్రేక్‌ పడింది. అయితే, 2018 జూన్‌ నెలలో ఉన్న రూ.95,610 కోట్లతో పోలిస్తే 4.5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

Most from this category