STOCKS

News


మొబైల్స్ దే మెజారిటీ వాటా

Tuesday 24th December 2019
Markets_main1577158778.png-30391

ఆన్‌లైన్‌ షాపింగ్‌పై నీల్సన్‌ సర్వే
తొలిసారి కస్టమర్లు 56 శాతం
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్‌లైన్‌ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే-జూలైతో పోలిస్తే ఆగస్టు-అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్‌ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్‌లైన్‌ కస్టమర్ల షాపింగ్‌ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్‌ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు-25 అక్టోబరు మధ్య ఫెస్టివ్‌ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్‌ వాటా ఏకంగా 53 శాతం ఉంది. 
అధిక ఆర్డర్లు ఎఫ్‌ఎంసీజీలో..
2019 మే-ఆగస్టు కాలంలో జరిగిన షాపింగ్‌లో విలువ పరంగా మొబైల్స్‌ 48 శాతం, ఫ్యాషన్‌ 16 శాతం కైవసం చేసుకున్నాయి. ఇక అత్యధిక ఆర్డర్లు (పరిమాణం) ఎఫ్‌ఎంసీజీ విభాగంలో 56 శాతం చోటుచేసుకోవడం విశేషం. ఎఫ్‌ఎంసీజీలో ఎక్కువ ఆర్డర్లు 50 లక్షలు ఆపై జనాభా ఉన్న మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రథమ శ్రేణి నగరాల నుంచి మొబైల్‌ ఫోన్ల కోసం 50 శాతం ఆర్డర్లు వస్తే.. మెట్రోల నుంచి ఇది 38 శాతంగా ఉంది. ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ విభాగంలో మే-అక్టోబరు మధ్య నాలుగింట మూడు భాగాలు దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి. 
షాపింగ్‌ రాత్రిపూటే..
మొబైల్స్‌ తర్వాత ఫ్యాషన్‌, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్‌ సీజన్లో ప్రైమ్‌ టైంలో అంటే రాత్రి 8-11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్‌ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్‌ నమోదైంది. పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్‌ డే సేల్‌ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్‌ పీరియడ్‌ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్‌ సీజన్‌ తొలి వారంలో 43 శాతం సేల్స్‌ జరిగాయి. You may be interested

90 నిముషాల్లో ఫోన్‌ డెలివరీ

Tuesday 24th December 2019

ఆన్‌లైన్‌లోకి ‘బిగ్‌ సి’ మొబైల్స్‌ స్మార్ట్‌ ఉపకరణాలూ విక్రయం కంపెనీ ఫౌండర్‌ బాలు చౌదరి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ ఆన్‌లైన్‌ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్‌, యాప్‌ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిముషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్‌ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో

ప్రతికూల ఓపెనింగ్‌!?

Tuesday 24th December 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్లు డౌన్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 12,262 పాయింట్ల వద్ద కదులుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు చేయనున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో సోమవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల వద్ద

Most from this category