News


డేటా వాడేస్తున్నారు

Friday 27th December 2019
news_main1577419541.png-30469

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- దేశంలో వైర్‌లెస్‌ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్‌ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబరులో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్‌లెస్‌ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబరు చివరినాటికి 66.48 కోట్లకు చేరారు. 2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా అధికమవుతోందని ట్రాయ్‌ అంటోంది. ‘4జీ/ఎల్‌టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్‌ నెట్‌వర్క్స్‌ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లు లభించడం ఇంటర్నెట్‌ వాడకాన్ని పెంచింది. మొబైల్‌ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లీషు, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్‌ టైమ్‌ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్‌ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్‌ తెలిపింది. 



You may be interested

మార్చికి నికర ఎన్‌పీఏలు 3.2 శాతానికి దిగొస్తాయి

Friday 27th December 2019

బ్యాంకింగ్‌ రంగంపై ఇక్రా నివేదిక ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో నికర మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) వచ్చే మార్చి నాటికి 3.2-3.3 శాతానికి దిగొస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ‘‘బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. అదే సమయంలో ఎన్‌పీఏలుగా మారే రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణాల మాఫీ గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల వసూళ్లలో పురోగతి ఉంటుంది’’ అని ఇక్రా తన

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ 46 పాయింట్లు జూమ్‌

Friday 27th December 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 41,302 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,172 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category